Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కొడుకు సినిమాకు నాగ్ వాయిస్ ఓవర్

కొడుకు సినిమాకు నాగ్ వాయిస్ ఓవర్

నాగ చైతన్య ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్రేమమ్. ఈ సినిమాపై మంచి అంచనాలుున్నాయి. అందుకే ఈ సినిమాను ప్రమోట్ చేయాలని చైతూ డాడీ, అంకుల్ ఇద్దరూ డిసైడ్ అయినట్లున్నారు. సినిమాలో ఓ కామియో రోల్ లో వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాకు అవసరమైన వాయిస్ ఓవర్ కు నాగ్ సిద్దమవుతున్నట్లు వినికిడి. నాగ్, వెంకీల పార్టిసిపేషన్ వుందీ అంటే వచ్చే మైలేజ్ వేరుగా వుంటుంది.

ఆగస్టులో విడుదలకు ఈ సినిమా రెడీ అవుతోంది. గోవాలో టాకీ ఫైనల్ వర్క్ కు రెడీ అవుతున్నారు. అదయ్యాక సాంగ్స్.. స్తవానికి జూలైలో విడుదల అనుకున్నారు కానీ, ఇదే సంస్థ నిర్మించే బాబు బంగారం ఆలస్యమై, జూలైకి చేరింది. అందువల్ల ఇది మరో నెల వెనక్కు వెళ్లేలా వుంది. వంశీ సూర్యదేవర నిర్మించే ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?