కోపాన్ని, దాహాన్ని శాసించడమా?

'కోపాన్ని, దాహాన్ని ఇంకోడు శాసించే పరిస్థితుల్లో మనం వుండకూడదు' ఇదీ డైలాగు.. శర్వా లేటెస్ట్ మూవీ రణరంగం టీజర్ లో. సాధారణంగా దర్శకుడు సుధీర్ వర్మ స్టోరీ కన్నా నెరేషన్ మీద ఎక్కువ దృష్టి…

'కోపాన్ని, దాహాన్ని ఇంకోడు శాసించే పరిస్థితుల్లో మనం వుండకూడదు' ఇదీ డైలాగు.. శర్వా లేటెస్ట్ మూవీ రణరంగం టీజర్ లో. సాధారణంగా దర్శకుడు సుధీర్ వర్మ స్టోరీ కన్నా నెరేషన్ మీద ఎక్కువ దృష్టి పెడతారు. టీజర్ కాబట్టి ఎక్కువ చెప్పరు.. చెప్పడానికీ వుండదు. కానీ రణరంగం టీజర్ మొత్తం మీద హీరో శర్వానంద్ డౌన్ టు డాన్ ఎలా ఎదిగిందీ అన్నది చెప్పలేదు. జస్ట్ కొన్ని సంఘటనలను పేర్చి చూపించారు.

సినిమా జోనర్ ఇదీ, ఇలా వుండబోతోందీ అన్నది పరిచయం చేయడానికి మాత్రమే టీజర్ ను వాడినట్లు కనిపిస్తోంది. అంతకు మించి సింగిల్ పాయింట్ కానీ, కథను టచ్ చేసే సీన్ ను కానీ టీజర్ లోకి తీసుకురాకుండా జాగ్రత్తపడ్డారు.

టీజర్ ప్రారంభంలో 'దేవుడిని నమ్మాలంటే భక్తి వుంటే సరిపోతుంది. కానీ మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి' అనే డైలాగు, చివరిలో వేసిన డైలాగు వింటే మాత్రం, సినిమాకు కాస్త మాంచి డెప్త్ వుందీ అనే అనిపిస్తోంది. ఇప్పటికే బాగా ఆలస్యం అయిన ఈ సినిమా ఆగస్టులో థియేటర్లలోకి వస్తుందని అంచనా.

సినిమా రివ్యూ: బ్రోచేవారెవరురా  సినిమా రివ్యూ: కల్కి