కొరటాల కూడా వదిలేసాడు

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ దేవీశ్రీ ప్రసాద్ కు ఏస్ డైరక్టర్ కొరటాల శివ కూడ గుడ్ బై చెప్పేసాడు. ఇప్పటి వరకు ఇద్దరు కలిసి నాలుగు బ్లాక్ బస్టర్లకు పని చేసారు. అన్నీ కూడా…

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ దేవీశ్రీ ప్రసాద్ కు ఏస్ డైరక్టర్ కొరటాల శివ కూడ గుడ్ బై చెప్పేసాడు. ఇప్పటి వరకు ఇద్దరు కలిసి నాలుగు బ్లాక్ బస్టర్లకు పని చేసారు. అన్నీ కూడా మ్యూజికల్ హిట్ లే. కానీ తొలిసారిగా కొరటాల శివ ఓ హిందీ మ్యూజిక్ డైరక్టర్ తో పని చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ రోజు లాంఛనంగా పూజా కార్యక్రమం జరుపుకున్న మెగాస్టార్ 152వ సినిమా వివరాల్లో మ్యూజిక్ డైరక్టర్ పేరు లేదు. దీనికి కారణం మరేమీకాదు, కొరటాల మరో వేరే ఎవరితోనైనా పని చేయాలని అనుకోవడమే. అయితే కొరటాల మాత్రమే అనుకుంటున్నారా? లేక మెగాస్టార్ కూడా అనుకుంటున్నారా? అన్నది అనుమానం. ఎందుకంటే మెగాస్టార్ కు, రామ్ చరణ్ కు ఇష్టమైతే కొరటాల కాదని అనే అవకాశం తక్కువ.

ఖైదీ 150 సినిమా విజయంలో దేవీశ్రీప్రసాద్ పాత్ర చాలా కీలకం. కానీ సైరా సినిమాకు మాత్రం అతన్ని తీసుకోలేదు. పోనీ అది భారీ సినిమా, పాన్ ఇండియా సినిమా అందుకోసం తీసుకోలేదు అని సరిపెట్టుకుంటే ఇప్పుడు ఈ రెగ్యులర్ కమర్షియల్ సినిమాకు కూడా తీసుకోవడం లేదు అంటే, మెగా క్యాంప్ కూడా దేవీశ్రీప్రసాద్ ను దూరం పెడుతోందా? అని అనుకోవాల్సి వస్తోంది.

నిజానికి రామ్ చరణ్ రంగస్థలం సినిమాకు దేవీ అద్భుతమైన పాటలు ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసికి కూడా దేవీ పనిచేయలేదు. ఆ తరువాత నుంచి త్రివిక్రమ్ అనిరుధ్, థమన్, మిక్కీ లాంటి వాళ్లతో పని చేస్తున్నారు. మొత్తంమీద దేవీ ఇన్నింగ్స్ తెలుగు నాట రాను రాను తగ్గుతోందని అర్థం అవుతోంది. మహేష్ బాబు మహర్షి సినిమా తరువాత దేవీ మీద కాస్త ఆసక్తి తగ్గుతున్న సంగతి తెలిసిందే.

మెగాస్టార్ 152వ సినిమా ఓపెనింగ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

జగన్‌ లో పరిణితి.. చంద్రబాబులో అసహనం