పూరిజగన్నాధ్ తో ఇజమ్ చేయడం కోసం పూర్తిగా కొత్తగా కనిపించాడు హీరో కళ్యాణ్ రామ్. ఆ సినిమా తరువాత బ్రదర్ ఎన్టీఆర్ సినిమా కోసం నిర్మాతగా బిజీ అయిపోయాడు. ఇదిగో ఇప్పుడు మళ్లీ సినిమా చేయబోతున్నాడు. శ్రీనువైట్ల దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన ఉపేంద్ర ఈ సినిమాకు దర్శకుడు. ఎన్టీఆర్ సన్నిహితుడు, డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి ఈ సినిమాకు నిర్మాత.
అయితే ఈ సినిమా కోసం మళ్లీ కాస్త కొత్తగా తయారయ్యాడట కళ్యాణ్ రామ్. జుట్టు బాగా తగ్గించి, డిఫరెంట్ గా కట్ చేసి, బాడీని స్లిమ్ చేసి, మాంచి లుక్ లోకి మారాడట. మారిన లుక్ ను మొన్నటికి మొన్న సినిమాకు పూజ చేసిన నాడు జనాలకు కనిపించాడు. ఆ లుక్ కే మరింత మెరుగులు దిద్ది సినిమాలో కనిపించబోతున్నాడట. హీరోలకు ఇప్పుడు ఇదో కార్యక్రమం అయిపోయింది. సినిమా సినిమాకు కాస్త లుక్ మార్చడం అన్నది తప్పని సరి అయింది.