క్రిష్ ‘కంచె’ గట్టిగానే వుంది

కంచె..డైరక్టర్ క్రిష్-హీరో వరుణ్ తేజ చేస్తున్న సినిమా. 1940 దశకానికి సంబంధించిన వార్ అండ్ లవ్ సబ్జెక్ట్. ఈ సినిమా టీజర్ ఈ రోజు విడుదల చేసారు. ఓ రేంజ్ లో వుంది. వరుణ్…

కంచె..డైరక్టర్ క్రిష్-హీరో వరుణ్ తేజ చేస్తున్న సినిమా. 1940 దశకానికి సంబంధించిన వార్ అండ్ లవ్ సబ్జెక్ట్. ఈ సినిమా టీజర్ ఈ రోజు విడుదల చేసారు. ఓ రేంజ్ లో వుంది. వరుణ్ తేజ్ గెటప్, వార్ సీన్లు, సినిమాకు వున్న లవ్ టచ్ అన్నీ చిన్నటీజర్ లోనే చాలా క్లియర్ గా చెప్పారు. మొత్తం మీద టీజర్ అదిరింది. సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది. 

Click Here For Teaser

ఫస్ట్ మూవీ క్లాస్ జోనర్ చేసి, రెండది కూడా క్రిష్ లాంటి డైరక్టర్ తో చేస్తుంటే జనం కాస్త ఉచిత సలహాలు వదిలారు. కానీ ఇప్పుడు ఈ టీజర్ చూసాక, వరుణ్ మంచి సినిమానే ఎంచుకున్నాడన్న కాంప్లిమెంట్లు ఖాయం. ఇప్పుడు ఈ టీజర్ చూసాక అక్టోబర్ 2న దీనికి పోటీగా వస్తాయనుకున్న సినిమాలు కూడా వెనక్కు తగ్గే అవకాశం వుంది.