నటుడు కృష్ణ భగవాన్ బేసిక్ గా మాటల రచయిత. వంశీ-మోహన్ బాబు కాంబినేషన్ లోని డిటెక్టివ్ నారద సినిమాకు మాటల రచయిత అతనే. ఇప్పటికీ తన పాత్రల సంభాషణలకు కొన్ని చమక్కలు అద్దుతుంటారు.
ఇంతకీ విషయం ఏమిటంటే, కృష్ణ భగవాన్ ఓ మాంచి కథ, స్క్రీన్ ప్లే, మాటలతో ఓ స్క్రిప్ట్ రెడీ చేసారట. దాన్ని డైరక్టర్ వంశీ తెరకెక్కిస్తారని తెలుస్తోంది. వంశీ దగ్గర వున్న ప్లస్ పాయింట్ ఏమిటంటే, మేకింగ్ కు వృధా ఖర్చులు వుండవు.
టెక్నీషియన్లను కూడా పెద్ద పెద్దవాళ్లను అడగరు. ఇచ్చిన వాళ్లతోనే మంచి అవుట్ పుట్ తీసుకుంటారు. ఫ్యాషన్ డిజైనర్ స్క్రిప్ట్ పరంగా వీక్ అయింది కానీ టెక్నికల్ గా సినిమాకు వంక లేదు. కానీ ఆ సినిమాకు ఖర్చయింది. మూడు నుంచి మూడున్నర కోట్లే అని వినికిడి. ఎ సర్టిఫికెట్ లేకుండా వుండి వుంటే రికవరీ పెద్దగా సమస్య కాకుండా వుండేది.
అందువల్ల మళ్లీ వంశీకి సిన్మా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు కృష్ణ భగవాన్ దగ్గర వున్న స్క్రిప్ట్ ను తీసుకుంటున్నారట. ఈసారి అయినా వంశీ తన అభిమానుల ఆకలి తీరుస్తారని ఆశిద్దాం.