కెఎస్ రామారావుకు చరణ్ సినిమా

క్రియేటివ్ కమర్షియల్స్-చిరంజీవి అంటే ఒకప్పటి హిట్ కాంబినేషన్. అలాంటి బ్యానర్ ఇప్పుడు వెనుకబడింది. చాన్నాళ్ల తరువాత ఆ బ్యానర్ మీద మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తేజ్ ఐ లవ్ యూ…

క్రియేటివ్ కమర్షియల్స్-చిరంజీవి అంటే ఒకప్పటి హిట్ కాంబినేషన్. అలాంటి బ్యానర్ ఇప్పుడు వెనుకబడింది. చాన్నాళ్ల తరువాత ఆ బ్యానర్ మీద మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తేజ్ ఐ లవ్ యూ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన పాత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ కేఎస్ రామారావుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ అనుబంధం గుర్తు పెట్టుకుని, కెఎస్ రామారావు గురించి తన కొడుకు రామ్ చరణ్ తనంతట తాను ప్రస్తావించి, ఓ సినిమా చేస్తానని చెప్పాడని చిరు ప్రకటించారు.

సభాముఖంగా మాట ఇస్తున్నానని, రాజమౌళి సినిమా తరువాత రామ్ చరణ్ సినిమా చేస్తే, అది కెఎస్ రామారావుతోనే అని చిరంజీవి అనౌన్స్ చేసారు. తాను రామ్ చరణ్ తో మాట్లాడే ఈ ప్రకటన చేస్తున్నాని చిరంజీవి తెలిపారు.

ఈ ప్రకటన చేయడానికి ముందు, ప్రకటన చేసిన తరువాత మెగాస్టార్ చేసిన సుదీర్ఘ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. పవన్ కళ్యాణ్ గురించి, తొలి ప్రేమ సినిమా గురించి ప్రస్తావిస్తూ నా తమ్ముడు అంటూ ఆ సినిమా ముచ్చట్లు, వైట్ అండ్ వైట్ లో పవన్ గెటప్ ను చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

మెగా హీరోలు డ్యాన్స్ లు, ఫైట్లు చేయడం గొప్పకాదని, ఏ సినిమా అయినా కష్టపడి చేయడం, క్రమశిక్షణతో వుండడం ముఖ్యం అని, అది తప్పితే తానే అందరికన్నా ముందు మందలిస్తానని చిరంజీవి తెలిపారు.

ఫొటోస్ కోసం క్లిక్ చేయండి