శ్రీహరి స్థానంలోకి భార్య శాంతి రాబోతోందా? శ్రీహరి కలలుకన్న కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీకి దిగబోతోందా?? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. శ్రీహరి మరణించకముందు… వైకాపా తీర్థం పుచ్చుకొనేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. అటు శ్రీహరి, ఇటు వైకాపా పార్టీ ఒక ఒప్పందానికి వచ్చాయి. శ్రీహరి కోరుకొన్న కూకట్‌పల్లి స్థానం ఇవ్వడానికి వైకాపా కూడా ఓకే అంది.
కానీ ఆ తరువాత శ్రీహరి కాంగ్రెస్ వైపునకు మొగ్గుతున్నారన్న వార్తలు కూడా వినవచ్చాయి. విభజన నిర్ణయం తీసుకోవడం ఇందుకు కారణం. అంతలోనే శ్రీహరి హఠాన్మరణంతో ఈ తతంగానికి ఊహించని పుల్‌స్టాప్ పడింది. ఇప్పుడు మళ్లీ కూకట్‌పల్లి రాజకీయం ఊపందుకొంది. అక్కడి నుంచి పోటీ చేయడానికి శాంతి సముఖంగా ఉందని సమాచారమ్. ఈ విషయాన్నిరాజకీయ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి.
శ్రీహరికున్న ఇమేజ్, ఆయనపై వచ్చిన సానుభూతి ఇవన్నీ శాంతిని గెలిపించి తీరతాయన్నది రాజకీయ వర్గాల మాట. శాంతి కూడా తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసిందట. త్వరలోనే శాంతి ఈ విషయమై మీడియా సమావేశం కూడా నిర్వహిస్తుందని టాక్. శ్రీహరికి ఉన్న క్లీన్ ఇమేజ్.. శాంతికి ఇప్పుడు శ్రీరామరక్ష. అయితే ఇంతకీ వైకాపానా? లేక కాంగ్రెస్ నా?