Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కుర్రాడు.. పూరి దృష్టిలో పడ్డాడు.!

కుర్రాడు.. పూరి దృష్టిలో పడ్డాడు.!

కుర్రాడు.. మన పక్కింటి కుర్రాడే, మన ఇంట్లో కుర్రాడే అన్నట్లుంటాడు యంగ్‌ హీరో నాగశౌర్య. తెరపై నటిస్తున్నట్లుగా కాక, తెరపై కన్పించే పాత్రలో ఒదిగిపోయే అతికొద్దిమంది నటుల్లో నాగశౌర్య ఒకడు. తక్కువ సినిమాలతోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్యకి మాస్‌ హీరో అనిపించుకోవాలనే కోరిక మాత్రం నెరవేరడంలేదు. 

ఆ మధ్య 'జాదూగాడు' అనే సినిమా ట్రై చేశాడుగానీ, సినిమా బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడింది. దాంతో మళ్ళీ క్లాస్‌ సినిమాలవైపే మొగ్గు చూపాడు. అయితే అదృష్టం ఇప్పుడు నాగశౌర్య తలుపుతట్టినట్లుంది. దర్శకుడు పూరి జగన్నాథ్‌, పిలిచి మరీ నాగశౌర్యకి అవకాశమిచ్చాడన్న ప్రచారం టాలీవుడ్‌లో గుప్పుమంది. ప్రస్తుతం కళ్యాణ్‌రామ్‌తో 'ఇజం' సినిమా చేస్తున్న పూరి, ఆ తర్వాత నాగశౌర్యతో పక్కా మాస్‌ మూవీని తెరకెక్కించబోతున్నాడట. అదీ రికార్డు స్థాయిలో అతి తక్కువ సమయంలోనేనట. 

ఇంకేముంది, నాగశౌర్య దశ తిరిగినట్లే లెక్క. మాస్‌ హీరోగా నాగశౌర్యని చూపించడానికి పూరి కన్నా పెర్‌ఫెక్ట్‌ డైరెక్టర్‌ ఇంకెవరుంటారు.? పైగా, నాగశౌర్యతో 'చంటిగాడు లోకల్‌..' టైపు డైలాగుల్ని పూరి జగన్నాథ్‌ తప్ప ఇంకెవరు పలికించగలరు. ఇప్పటిదాకా క్లాస్‌ సినిమాల్లో తన ఈజ్‌తో ఆకట్టుకున్న నాగశౌర్య, పూరి హీరో తెరహాలో తెరపై పక్కా మాస్‌ లుక్‌తో అదరగొట్టేస్తే.. నాగశౌర్య కెరీర్‌ ఓ రేంజ్‌లో పరుగులు పెడ్తుంది. చూద్దాం.. ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కేదెప్పుడో.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?