హమ్మయ్య..ఇప్పటికి కృష్ణవంశీకి ఖాళీ దొరికింది. సినిమా విడుదల నానా హైరానాతో జరిగింది. మెగాస్టార్, ప్రొడ్యూసర్ కూడా సినిమాను ఎలాగైనా దసరాకు తేవాలని పట్టుపట్టారు. అయిపోయిన సినిమ అయిపోయినట్లు ముంబాయి పట్టుకెళ్లి డిఐ చేయించారు. ఓ పాట వుండిపోతే..ఏం వచ్చిన నష్టం లేదు తరువాత ఏడ్ చేసుకుందాం.. అయిదుపాటలతోనే కానిచ్చేయండి అని మెగాస్టార్ హుకుం జారీ చేసారు. దాంతో దాన్ని పక్కన పెట్టి పూర్తి చేసారు.
సెన్సారు ఒకటి రెండు రోజుల్లో వుందనగా హైదరాబాద్ లో చివరి పాట చిత్రీకరించారు. ఆరోపాటను ఇప్పుడు చిత్రీకరిస్తారు. పూర్తి చేసి, పక్కన పెట్టి తరువాత కలపడం వేరు. సినిమా విడుదలయ్యాక చిత్రీకరణ ప్రారంభించడం అదో తరహా. ఇలాంటి పనులతో కృష్ణవంశీ కి ఊపరిలపరలేదు పాపం.
సినిమా విడుదలకు ఒకటి రెండు రోజుల ముందు కూడా ఇంకా సినిమాకు నట్లు బోల్టులు బిగిస్తూనే వున్నారు ఆయన. మీడియాను రమ్మని మరీ నాలుగైదు గంటలు వెయిట్ చేయించి కూడా వదిలేసారు. ఇప్పుడు అవసరం వచ్చింది. సినిమాను ఎత్తుకోవాలి తప్పదు. అందుకే మీడియా ఇంటర్వూలు ప్రారంభిచారని వినికిడి. సినిమా విడుదలైన మర్నాడే ఆయన మీడియా పేరంటాలు ప్రారంభించేసారు. ఇక రాసుకున్నావాళ్లకు రాసుకున్నంత చెప్పొచ్చు.