Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కృష్ణవంశీకి తమన్నా సపోర్ట్‌

కృష్ణవంశీకి తమన్నా సపోర్ట్‌

‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంతో తాను కోరుకున్న భారీ విజయాన్ని అందుకోలేకపోయాడు కానీ నలభై కోట్ల ఫలితాన్ని రాబట్టి తనలో ఇంకా విషయం మిగిలే ఉందని విమర్శకులకి తెలియజెప్పాడు. ఈ చిత్రం తర్వాత స్టార్‌ హీరోల కోసం వేచి చూడకుండా కృష్ణవంశీ కొత్త నటీనటులతో ఒక సినిమా ప్లాన్‌ చేస్తున్నాడు. 

ఈ చిత్రాన్ని నిర్మించడానికి దిల్‌ రాజు, ప్రకాష్‌రాజ్‌ అంగీకరించారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. కొత్త వాళ్లతో తీసే ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర చేయడానికి తమన్నా అంగీకరించినట్టు లేటెస్ట్‌ న్యూస్‌. కొత్త తారాగణానికి సపోర్ట్‌గా తమన్నా ఇందులో ప్రధాన పాత్ర చేస్తుందన్నమాట. 

బాహుబలి చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తమన్నా వచ్చే ఏడాది అయినా బౌన్స్‌ బ్యాక్‌ అవ్వాలని చూస్తోంది. అందుకే పేరున్న దర్శకులతో అవకాశాలు వస్తే కాదనకుండా ఓకే చేసేస్తోంది. తనపై పడ్డ ఫ్లాప్‌ హీరోయిన్‌ ముద్రని చెరిపేసుకోవాలని తమన్నా తన వంతు ప్రయత్నాలు అన్నీ చేస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?