లాభాల్లో ర‌భ‌స‌

పెద్ద హీరో సినిమా అయినంత మాత్రాన ఇప్పుడు ఎగ‌బ‌డి కొనేయ‌డం లేదు. బ‌య్యర్లు ఒక‌టికి నాలుగుసార్లు ఆలోచిస్తున్నారు. ఫ్యాన్సీ రేట్ల‌కు సినిమాని అమ్ముకొనేంత ఇమేజ్ ఎన్టీఆర్ కి ఉంది. అయితే… గ‌త సినిమాలు బ‌య్యర్లును…

పెద్ద హీరో సినిమా అయినంత మాత్రాన ఇప్పుడు ఎగ‌బ‌డి కొనేయ‌డం లేదు. బ‌య్యర్లు ఒక‌టికి నాలుగుసార్లు ఆలోచిస్తున్నారు. ఫ్యాన్సీ రేట్ల‌కు సినిమాని అమ్ముకొనేంత ఇమేజ్ ఎన్టీఆర్ కి ఉంది. అయితే… గ‌త సినిమాలు బ‌య్యర్లును భ‌య పెడుతున్నాయి. 

అయితే.. మ‌రోసారి ఎన్టీఆర్ స్టార్‌డ‌మ్, ఇమేజ్….. ర‌భ‌స‌కు క‌లిసొచ్చాయి. ఈ సినిమా పాట‌లు బ‌య‌ట‌కు రాకుండానే సినిమా బిజినెస్ జ‌రిగిపోయింది. అన్ని ఏరియాల నుంచీ మంచి రేట్లకు సినిమా కొనేసిన‌ట్టు తెలుస్తోంది. శాటిలైట్ హ‌క్కుల కోసం జెమిని క‌ర్చీఫ్ వేసేసింది. మొత్తానికి దాదాపుగా రూ.5 కోట్లు టేబుల్ ప్రాఫిట్ వ‌చ్చే సూచ‌న‌లున్నాయ‌ట‌. 

రామ‌య్యా వ‌స్తావ‌య్యా డిజాస్టర్ అయినా స‌రే… ర‌భ‌స‌కు ఈ రేంజ్‌లో ఫ్యాన్సీ ఆఫ‌ర్లు రావ‌డం.. ఎన్టీఆర్ స్టామినాకు నిద‌ర్శనం!  శాటిలైట్ హ‌క్కులు ఏమేర అమ్ముడు పోతాయి అన్న విష‌యంపై… ర‌భ‌స లాభం ఆధార ప‌డి ఉంది. మొత్తానికి చాలా కాలం నుంచి హిట్లు లేని… బెల్లంకొండ సురేష్ నోట్లో… ర‌భ‌స బెల్లం ముక్క పెట్టిన‌ట్టే క‌నిపిస్తోంది.