లవకుశ ఉత్తరాంధ్ర పంచాయతీ తెగిందా?

జై లవకుశ బిజినెస్ ఎప్పుడో పూర్తయింది. అయితే ఒక్క నైజాం, ఉత్తరాంధ్ర విషయంలో ఓ మాట అనుకున్నారు. కానీ టర్మ్స్ అవీ ఇంకా ఫైనల్ కాలేదు. ఆఖరికి నైజాం రేటును 18 కోట్లు ఫిక్స్…

జై లవకుశ బిజినెస్ ఎప్పుడో పూర్తయింది. అయితే ఒక్క నైజాం, ఉత్తరాంధ్ర విషయంలో ఓ మాట అనుకున్నారు. కానీ టర్మ్స్ అవీ ఇంకా ఫైనల్ కాలేదు. ఆఖరికి నైజాం రేటును 18 కోట్లు ఫిక్స్ చేసి, రెండు కోట్లు రిటర్నబుల్ అడ్వాన్స్ గా పెట్టారని వినికిడి. ఇది కాకుండా విశాఖకు ఏ టెర్మ్స్ అన్నది ఇంకా తెలియలేదు. అక్కడ ఎనిమిది కోట్లు రేటు ఫిక్స్ చేసారు. అయితే ఈ ఎనిమిది కోట్ల విషయంలో కూడా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఏవో టెర్మ్స్ అడుగుతున్నారని, అవి ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది.ప్రస్తుతానికి ఇరవై కోట్లు ఇచ్చి, మిగిలినవి సినిమా హిట్ అయితే లెక్కలు చూసుకుందామని దిల్ రాజు అడుగుతున్నట్లు తెలుస్తోంది.

టోటల్ గా ఆంధ్ర అంతా 36కోట్ల రేషియోలో విక్రయాలు జరిపారు. నేనే రాజు నేనే మంత్రి, ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో ఎమ్మెల్యే సినిమా నిర్మిస్తున్న భరత్ చౌదరి ఈస్ట్ ఏరియాను 5.86కోట్లకు తీసుకున్నారు. సరిగ్గా ఇదే రేటుకు ఈస్ట్ స్పైడర్ కూడా ఫిక్స్ కావడం విశేషం.

స్పైడర్ ను ప్రభాస్ బంధువులో, స్నేహితులో తీసుకుని, వింటేజ్ క్రియేషన్స్ దగ్గర పంపిణీకి వుంచినట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే దాదాపు మిగిలన ఆంధ్ర ఏరియాలన్నీ ఇదే 36కోట్ల రేషియోలో ఎన్టీఆర్ రెగ్యులర్ బయ్యర్లకే ఇచ్చారు.

గుంటూరు ఏడుకోట్లకు కాస్త అటుగా, కృష్ణ అయిదున్నరకోట్లకు, వెస్ట్ నాలుగున్నర కోట్లకు, గుంటూరు ఏడుకోట్ల ఇరవైలక్షలకు, నెల్లూరు మూడుకోట్లు పది లక్షలకు ఇచ్చినట్లు తెలుస్తోంది.