మొన్నటికిమొన్న పూజా హెగ్డే బికినీతో అదరగొట్టేసింది. టైట్ డ్రెస్సులు వేసుకొని మోడ్రన్ గా కనిపించడానికి రకుల్ ప్రీత్ ఎప్పుడూ రెడీ. రెజీనా, రాశిఖన్నా లాంటి తారలు అవకాశం చిక్కినప్పుడల్లా అందాల ప్రదర్శన చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఈ రేసులోకి రాని ఒకే ఒక్క బ్యూటీ లావణ్య త్రిపాఠి.
మొన్నటివరకు గర్ల్ నెక్ట్స్ డోర్ ఇమేజ్ తో సినిమాలు చేసిన ఈ అమ్మడు కూడా ఇప్పుడు అందాలు పరిచేందుకు రెడీ అయిపోయింది. ఈ దిశగా ఇప్పటికే కొన్ని హాట్ హాట్ స్టిల్స్ రిలీజ్ చేసిన ఈ భామ.. త్వరలోనే వెండితెరపై అందాల విందు ఇచ్చేందుకు సిద్ధమైంది. యుద్ధం శరణం సినిమాలో హాట్ లావణ్యను చూడొచ్చంటున్నారు.
ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే లావణ్య కు సంబంధించి ఓ వర్కింగ్ స్టిల్ రిలీజైంది. చిన్న నిక్కర్ వేసుకొని చాలా హాట్ గా ఉందా స్టిల్. అప్పుడే చాలామందికి డౌట్ కొట్టింది.
ఆ డౌట్ నిజమే అంటోంది యూనిట్. యుద్ధం శరణం సినిమాలో అల్ట్రామోడ్రన్ గా లావణ్య కనిపిస్తుందట. దీనికి తోడు తాజాగా జరిగిన సైమా అవార్డుల వేడుకకు కూడా హాట్ గా ముస్తాబై వచ్చింది లావణ్య. ఇవన్నీ చూస్తుంటే లావణ్య కూడా రూటు మార్చినట్టు కనిపిస్తోంది.