మాధురీదీక్షిత్‌కి‌ నిద్రలేకుండా చేసిన మగాడెవరంటే!

ఇటీవలే మాధురీపై తన ప్రేమను చాటుకున్నాడు సంజయ్ దత్. ఒకప్పుడు వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. అయితే టాడా కేసులో దత్ జైలుకు వెళ్లినప్పుడు వీరిద్దరి మధ్య దూరం పెరిగింది.. ఆ తర్వాత ఎవరికి…

ఇటీవలే మాధురీపై తన ప్రేమను చాటుకున్నాడు సంజయ్ దత్. ఒకప్పుడు వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. అయితే టాడా కేసులో దత్ జైలుకు వెళ్లినప్పుడు వీరిద్దరి మధ్య దూరం పెరిగింది.. ఆ తర్వాత ఎవరికి వారయ్యారు. ఆ తర్వాత ఇద్దరి జీవితాల్లోనూ చాలా జరిగాయి. పెళ్లిళ్లు అయ్యాయి, పిల్లలు పుట్టారు.. ఈ క్రమంలో కూడా దత్ మాధురిని మరవలేదు. మరో పెళ్లి చేసుకునే అవకాశం వస్తే ఎవరిని చేసుకుంటారు? అని అడగ్గనే మాధురిని అని ఈ హీరో చెప్పాడు. 

మరి దత్ ప్రేమ సంగతలా ఉంటే.. మాధురి క్రష్ మాత్రం మరో రకంగా ఉంది. తను యుక్త వయసులో ఒక క్రికెటర్ ను తెగ ఆరాధించాను అని మాధురీ చెప్పింది. అతడిని తెగ ప్రేమించేశానని… అనునిత్యం అతడి ధ్యాసే ఉండేదని… ఎంతగా అంటే.. చివరకు రాత్రిపూట కలల్లోకి కూడా అతడే వచ్చేవాడని మాధురి వివరించింది. మరి ఇంతకీ అతడెవరు? అంటే.. సునీల్ గవాస్కర్! అప్పట్లో సన్నీని తెగ ప్రేమించాను అని మాధురీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. తన ప్రేమ మాటల్లో వివరించలేనిది అంటూనే.. వివరించి చెప్పింది ఈ నటీమణి. 

సన్నీ చాలా సెక్సీ అని.. ఆయన తన కలల సుందరుడు అని మాధురి చెప్పింది. సన్నీని ఆరాధించిన రోజుల్లో తన వయసు 18 యేళ్లు అని మాధురీ చెప్పింది. ఆ విధంగా తన ఒకప్పటి ప్రేమ కథను.. వన్ సైడ్ ప్రేమకథను వివరించింది. హీరోయిన్ కాక ముందు ఈ అమ్మడు సన్నీని ఈ రకంగా ఆరాధించిందట. మరి మాధురిని ధ్యానించిన, ఆరాధించిన వారెంతమంది అంటే చెప్పడం కష్టం. ఇప్పటికే ఆమెను దేవతలా చూసే వాళ్లున్నారు. అలాంటి మాధురీకి నిద్రలేకుండా చేసిన మగాడు మాత్రం సునీల్ గవాస్కర్ అన్నమాట!