Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మాధురీ దీక్షిత్.. ఆ లిప్ కిస్ ఖ‌రీదు కోటి రూపాయ‌లా!

మాధురీ దీక్షిత్.. ఆ లిప్ కిస్ ఖ‌రీదు కోటి రూపాయ‌లా!

భార‌తీయ సినిమాల్లో ఇప్పుడంటే లిప్ కిస్సులు చాలా కామ‌న్. ఈ త‌ర‌హా సీన్లు లేని సినిమాలు అరుదయ్యాయి. అలాగే స్టార్ హీరోయిన్లు, కొత్త హీరోయిన్లు తేడా లేకుండా ఇలాంటి సీన్ల‌లో చేయ‌డం త‌ప్ప‌నిస‌రిగా మారింది. ఇలాంటి సీన్ల‌లో న‌టించ‌మంటూ మ‌డిక‌ట్టుకునే హీరోయిన్లు కూడా ఎవ్వ‌రూ లేరిప్పుడు. ఇంత‌కు మించి చేసేస్తున్నారు. అదేమంటే సీన్ డిమాండ్ చేసిందంటూ స్ప‌ష్టంగా త‌మ వాద‌న‌ను చెబుతున్నారు. 

అలాగే పెద్ద ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ తో వ‌చ్చిన హీరోయిన్లు కూడా ఈ సీన్ల‌కు అతీతం కాదు. అంటే హీరోల, నిర్మాత‌ల కూతుర్లు కూడా ఈ సీన్ల‌లో న‌టిస్తున్నారు. సారా అలీఖాన్, జాన్వీ క‌పూర్ వంటి వార‌సురాళ్ల‌తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా వీటిని త‌ప్పించుకోలేక‌పోతున్నారు. పెళ్లైన హీరోయిన్లు కూడా ఇలాంటి సీన్ల‌లో న‌టించ‌డం రొటీన్ అయ్యింది.

మ‌రి ఇప్పుడైతే ఇలా కానీ.. ప‌దేళ్ల కింద‌ట కూడా లిప్ కిస్ అనేది ప్ర‌త్యేకంగా చెప్పుకునే అంశ‌మే. గ‌త ప‌దేళ్ల లో చాలా మార్పులు జ‌రిగాయి కానీ, అంత‌కు ముందు లిప్ కిస్ ఒక సినిమాలో ఉందంటే అది ప్రీ రిలీజ్ లోనే పెద్ద‌గా చెప్పుకునే అంశంగా నిలిచేది. సీరియ‌ల్ కిస్స‌ర్స్ న‌టించే సినిమాల‌ను ప‌క్క‌న పెడితే పెద్ద హీరోల సినిమాల్లో, భారీ అంచ‌నాల సినిమాల్లో లిప్ కిస్ ప్ర‌త్యేకంగా మెన్ష‌న్ చేసుకునే అంశం.

మ‌రి ద‌శాబ్దం కింద‌టే అలా అంటే.. అంత‌కు రెండు ద‌శాబ్దాల కింద‌ట ప‌రిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవ‌డం క‌ష్టం కాదు. 80ల‌లో భారతీయ తెర‌పై లిప్ కిస్సులు అంటే బుగ్గ‌లు నొక్కుకునే స్థాయివి. స్మిమ్ సూట్లు, పైట జారుడు సీన్లే మోస్ట్ సెక్సీ. ఇక హీరో,హీరోయిన్లు పెద‌వీపెద‌వీ క‌ల‌పడం అనేది అంత తేలికైన‌ది కాదు.

స‌రిగ్గా అలాంటి స‌మ‌యంలో బాలీవుడ్ లో సంచ‌ల‌నం రేపిన లిప్ కిస్ *ద‌యావ‌న్* సినిమాలో ఉంటుంది. 1988లో ఫిరోజ్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో వినోద్ ఖ‌న్నా, మాధురీ దీక్షిత్ ల మ‌ధ్య‌న గాఢ‌మైన చుంభ‌న స‌న్నివేశం సంచ‌ల‌నంగా నిలిచింది. అప్ప‌టికే మాధురీ మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్. మ‌రి ఆమె అలా గాఢ‌మైన చుంభ‌న స‌న్నివేశంలో క‌నిపించ‌డం ఇప్ప‌టికీ హాట్ టాపిక్కే!. ఈ విష‌యంలో ఇప్ప‌టికీ ఆమె వివ‌ర‌ణ అడుగుతూ ఉంటారు కొంద‌రు సినీ జ‌ర్న‌లిస్టులు.

దీనిపై మాధురి స్పందిస్తూ.. త‌ను ఆ స‌న్నివేశంలో న‌టించాల్సింది కాద‌ని చెబుతూ ఉంటుంది. ఆ సీన్ కు అక్క‌డ ఎలాంటి ప్రాముఖ్య‌త లేక‌పోయినా పెట్టార‌నిపిస్తుంద‌ని, త‌ను దానికి నో చెప్పాల్సింద‌ని మాధురీ చెప్పుకొస్తూ ఉంటుంది.

అయితే అలా నో చెప్ప‌నీయ‌ని స్థాయిలో ఆమెకు ఆ స‌మ‌యంలో రెమ్యూనిరేష‌న్ ఆఫ‌ర్ చేశార‌ని, భార‌తీయుల క‌ల‌ల రాణి స్థాయిలో ఉండిన మాధురికి ఏకంగా కోటి రూపాయ‌ల రెమ్యూనిరేష‌న్ ను ఆఫ‌ర్ చేసి ఆ సీన్ల‌లో న‌టింప‌జేశార‌నే ప్ర‌చారం ఉంది.

మామూలుగా అయితే మాధురీ ఆ సీన్ కు నిస్సందేహంగా నో చెప్పేదే. అయితే ఆమెతో ఆ స‌న్నివేశంలో న‌టింప‌జేసేందుకు ద‌ర్శ‌కుడు ఫిరోజ్ ఖాన్ కోటి రూపాయ‌ల రెమ్యూనిరేష‌న్ ఇప్పించాడ‌ని దీంతోనే ఆమె నో చెప్ప‌లేక‌పోయిందంటారు. అప్ప‌టికి బాలీవుడ్ లోనే కాదు, ఇండియాలోనే కోటి రూపాయ‌ల రెమ్యూనిరేష‌న్ అరుదు. అమితాబ్ బ‌చ్చ‌న్ అప్ప‌టికి కోటి రూపాయ‌ల రెమ్యూనిరేష‌న్ ఉండేది. ఇండియాలో 1988 నాటికి కోటి రూపాయ‌లంటే దాని స్థాయి వ‌ర్ణించ‌న‌క్క‌ర్లేదు. మ‌రి అంత రెమ్యూనిరేష‌న్ దక్కిన‌ప్పుడు మాధురీ నో చెప్ప‌లేక‌పోయిందేమో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?