మహేష్ బాబు అప్ కమింగ్ సినిమా మహర్షి. శ్రీమంతుడు సినిమాలు ఊరు దత్తత తీసుకోవడం, భరత్ అనే నేను సినిమాలో బాధ్యత, జవాబు దారీ తనం కలిగి వుండడం వంటి అంశాలను టచ్ చేసిన మహేష్ బాబు, లేటెస్ట్ గా మహర్షి సినిమాలో ఆర్గానిక్ ఫార్మింగ్ ను టచ్ చేయబోతున్నారని తెలుస్తోంది.
అమెరికాలో వున్న హీరో స్నేహితుడిని ఆదుకోవడానికి ఇండియాలోని పల్లెకు వచ్చి, అక్కడ రైతుల సమస్యలు చూసి, ఆర్గానిక్ తదితర ఆధునిక వ్యవసాయ పద్దతుల పట్ల రైతులకు అవగాహన కల్పించి, వారిని అభివృద్ధి దిశగా నడిపే వ్యవహారం ఏదో వుందని తెలుస్తోంది.
శ్రీమంతుడులో జాగో.. జాగోరే.. జాగో టైపులో పాట వున్నట్లే, మహర్షిలో కూడా 'పోరా.. సాగిపోరా..' అంటూ పాట వుంటదట. ఈ పాటను ఇప్పటికే దేవీ అద్భుతంగా ట్యూన్ చేసి ఇచ్చేసాడట.
రఫ్ లుక్ లో మహేష్
ఇప్పటిదాకా మహేష్ తన సినిమాల్లో క్యారెక్టర్లు ఎలాంటివైనా సరే, సాఫ్ట్ లుక్ తోనే వుంటూ వచ్చాడు. స్మూత్ గానే నటిస్తూ వచ్చాడు. అయితే మహర్షి సినిమాలో ఫస్ట్ హాఫ్ మధ్య వచ్చే కాలేజీ ఎపిసోడ్ లో మహేష్ రఫ్ లుక్ తో కనిపించడమే కాదు, కాస్త కాంటెంపరరీ యూత్ మాదిరిగా యాక్టివ్ గా, రఫ్ గా, జోవియల్ గా కనిపిస్తాడట.
పాటలు ఇచ్చేసిన దేవీ
సాధారణంగా దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే చివరివరకు పాటలు పూర్తికావు. కానీ ఫర్ ఏ ఛేంజ్, ఈ సినిమాకు ఇప్పటికే మూడు ట్యూన్ లు ఇచ్చేసాడట దేవీ. సినిమా ప్లానింగ్ ముందుగా అనుకుని, సెట్ మీదకు వెళ్లడం లేట్ కావడంతో, ఈ గ్యాప్ లో దర్శకుడు వంశీ పైడిపల్లి, పాటలకు ట్యూన్ లు చేయించేసుకున్నాడట.
చిత్రంలో కీలకమైన కాలేజీ ఎపిసోడ్ లను డెహ్రాడూన్ లో, బిజినెస్ మాగ్నట్ గా హీరో కనిపించే ఏపిసోడ్ లను అమెరికాలో షూట్ చేయడం పూర్తిచేసారు. ఇక కీలమైన సెకండాఫ్ ఎమోషన్ సీన్లు అన్నీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో షూట్ చేయాల్సి వుంది. ఈ సినిమాకు పివిపి, అశ్వనీదత్, దిల్ రాజు నిర్మాతలు.