మహేష్ ఆ మాట అనలేడా?

రాష్ట్రంలో మారుతున్న పొలిటికల్ సినేరియా, వేడెక్కతున్న రాజకీయాలు చూసి భరత్ అనే నేను అబౌట్ టర్న్ అనేసాడు. భరత్ అనే నేను సినిమా ఫంక్షన్ విశాఖలో చేద్దాం అనుకున్నారు. అనుమతులు వగైరాల కోసం విచారించారు.…

రాష్ట్రంలో మారుతున్న పొలిటికల్ సినేరియా, వేడెక్కతున్న రాజకీయాలు చూసి భరత్ అనే నేను అబౌట్ టర్న్ అనేసాడు. భరత్ అనే నేను సినిమా ఫంక్షన్ విశాఖలో చేద్దాం అనుకున్నారు. అనుమతులు వగైరాల కోసం విచారించారు. ప్లానింగ్ చేసారు. కానీ రంగస్థలం టైమ్ లో జరిగిన హోదా హడావుడి చూడగానే మనసు మారిపోయింది. ఛలో విజయవాడ అన్నారు.

విజయవాడలో ఏకంగా అనుమతుల కోసం దరఖాస్తు చేసారు. ఏర్పాట్లు షురూ చేసారు. కానీ సిట్యువేషన్ ఇంకా హీట్ ఎక్కుతోంది అని అర్థం అయింది. ఇక లాభంలేదు. హైదరాబాద్ నే సేఫ్ అనుకున్నారు. ఇక్కడే చేయాలని డిసైడ్ అయిపోయారు.

మహేష్ లాంటి సూపర్ స్టార్ ఒక సినిమా ఫంక్షన్ చేయడానికి ఇంత భయపడడం ఏమిటో? విజయవాడలో కావచ్చు, వైజాగ్ లో కావచ్చు చేస్తే ఏమవుతుంది? హోదా కోసం నినాదాలు చేస్తారు. మహేష్ ను కూడా చెయ్యమంటారు. హోదా ఆంధ్రుల హక్కు అని ఓ మాట అంటే పోయేకదా? ఉద్యమకారులు ఎవరైనా హ్యాపీ అయిపోతారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి షూటింగ్ దగ్గరకు ఉద్యమకారులు వెళ్లి, తెలంగాణ జిందాబాద్ అనే దాకా వదిలేవారు కాదు. అలా అన్న తరువాతే షూటింగుకు దారి వదిలేవారు. దాదాపు అందరు హీరోలు, హీరోయిన్లు ఆ మాట అనేవారే.

మరి మహేష్ బాబు కూడా ముందుగానే హోదా ఆంధ్రుల హక్కు అని ఓ మాట అనేస్తే, విశాఖ, విజయవాడ ఎక్కడ ఫంక్షన్ చేసుకున్నా ఎవరూ అడ్డుతారేమో అని భయపడాల్సిన పనిలేదు. కానీ ఆ మాట అనడానికే ఎందుకు జంకుతున్నారో? భరత్ అనే నేను డైరక్టర్ కొరటాల శివ బాహటంగా తన అభిప్రాయం ఇప్పటికే చెప్పారు.

మహేష్ అలా ఎందుకు చెప్పలేరో? అన్నిచోట్లా వినిపిస్తున్నట్లు, మోడీని ఎదిరిస్తూ మాట్లాడితే, ఇన్ కమ్ టాక్స్ దాడులు జరుగుతాయేమో? అని మహేష్ కూడా భయపడుతున్నాడా? అలా అయితే మరి ఏ తెలుగు పెద్ద హీరో కూడా హోదా కోసం నినదిస్తారు అనుకోవడం కల్లయేమో?