మహేష్- అప్పుల అప్పారావు

హీరో మహేష్ బాబు ఫైనాన్షియర్ అవతారం ఎత్తబోతున్నాడు. ఇప్పటికే ఏ ఎమ్ బి మాల్ అంటూ థియేటర్లు, జి ఎమ్ బి బ్యానర్ తో సినిమాలు చేస్తున్నాడు కదా? కొత్తగా ఈ వ్యాపారం ఏమిటి?…

హీరో మహేష్ బాబు ఫైనాన్షియర్ అవతారం ఎత్తబోతున్నాడు. ఇప్పటికే ఏ ఎమ్ బి మాల్ అంటూ థియేటర్లు, జి ఎమ్ బి బ్యానర్ తో సినిమాలు చేస్తున్నాడు కదా? కొత్తగా ఈ వ్యాపారం ఏమిటి? అనుకోవద్దు..మహేష్ చేయబోయే ఈ వ్యాపారం సినిమా కోసం..ఊ..ఊ ఉత్తుత్తినే. సర్కారు వారి పాట సినిమాలో హీరో మహేష్ అప్పుల అప్పారావు మాదిరిగా కనిపిస్తాడన్న మాట.

ఒరిజినల్ కథ ప్రకారం అయితే అమెరికాలో తెల్లవాళ్లకి అప్పులు ఇచ్చే ఇండియన్ గా వుండాలి.కానీ ఇప్పుడు అమెరికాలో షూట్ లేకపోతే, గోవాలో వుంటూ నార్త్ ఇండియన్స్ కు అప్పులిచ్చే తెలుగోడిగా కనిపిస్తాడన్న మాట.  అప్పులు ఇవ్వడమే కాదు, వసూళ్ల విషయంలో ఖరాఖండీగా వుంటూ, రకరకాల ఫన్నీ టెక్నిక్ లతో వాటిని తిరిగి వసూలు చేసుకుంటూ ఫన్ పండిస్తాడట.

సినిమాలో ఫన్నీ పార్ట్ అంతా ఈ అప్పులు ఇవ్వడం, వసూలు చేసుకోవడం వంటి వాటి మీదే వుంటుందని తెలుస్తోంది. అందుకే కావచ్చు, మహేష్ ఫస్ట్ లుక్ లో మెడ మీద రూపాయి కాయిన్ టట్టూ కూడా వేసేసారు. మహేష్ ఇప్పటి వరకు చేయని ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ నే ఇది.

కేసీఆర్ ప్లాన్ బాలయ్యకు ముందే తెలుసా

పేద‌ల‌కు మంచి జ‌ర‌గ‌డం చంద్ర‌బాబుకు ఇష్టం లేదా?