Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ చుట్టూ..ఎంతమందో..?

మహేష్ చుట్టూ..ఎంతమందో..?

మహేష్ తో పూరి జగన్నాధ్ సినిమా అంటూ ఓ వార్త వచ్చేసింది. పైగా టైటిల్ 'జనగణమన'..ఇంకేముంది..భలే ఆసక్తి కలిగించేసింది. పూరి స్టయిల్ అది.. ఎవరైనా కథ చెప్పి పడగొడతారు హీరోలను. కానీ పూరి ముందు టైటిల్ చెప్పి పడగొడతాడు. తరువాత కథ సంగతి. మెగాస్టార్ కు ఇలాగే చెప్పాడు.. ఆటో జానీ అంటూ. ఆయన ఫ్లాట్.. కానీ కథ విన్నాక..? సినిమా అటకెక్కేసింది. 

పూరి ట్వీట్ కు మహేష్ ఏమన్నాడు. టైటిల్ కు తగ్గ మంచి కథ దొరికితే అలాగే అన్న మీనింగ్ లో ట్వీటేసాడు. అంటే వ్యవహారం ఇంకా విత్తనం స్టేజ్ లోనే వుందన్నమాట. నిజానికి మహేష్ ఏ డైరక్టర్ ను వద్దని చెప్పడు.. నిర్మాతలు కూడా అంతే..

శేఖర్ కమ్ముల లాంటి డైరక్టర్ ఎప్పటి నుంచో మహేష్ చుట్టూ తిరుగుతున్నాడు.. ఇక ఎప్పటకైనా డైరక్టర్ కావాలనుకుంటున్న వక్కతం వంశీ.. డిటో..డీటో.పూరి సంగతి చెప్పనక్కరలేదు. అంతకు ముందు లింగుస్వామి కొన్నాళ్లు ట్రయ్ చేసి ఆగిపోయాడు.

అశ్వనీదత్, కెఎస్ రామారావు లాంటి నిర్మాతలు అలా వెయిటింగ్ లిస్ట్ లో వున్నారు. ఇలా వెయిటింగ్ లిస్ట్ లో వుండలేక హారిక హాసిని చినబాబు అడ్వాన్స్ వెనక్కు తీసుకున్నారు.  అందువల్ల మహేష్ తో పూరి సినిమానా అని ఉలిక్కిపడిన వాళ్లు..మహేష్ అభిమానులు గాభరా పడక్కరలేదు.. ఎందుకు గాభరా.. ఎందుకు ఉలిక్కిపడడం అంటే ఇటీవల పూరి సినిమాలు ఎలా వుంటున్నాయో తెలుసుకుని. 

సో..ఈ సినిమా ఎప్పుడు మెటీరియలైజ్ అవుతుందో? పైగా ఇప్పడు మురగదాస్ తో మహేష్ ముందు ఓ సినిమా పూర్తి చేసి, వచ్చే ఉగాదికి విడుదల చేయాల్సి వుంది. అంటే వచ్చే ఉగాది తరువాతి సంగతి. ఈలోగా ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో దూసుకు వస్తారో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?