Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ సినిమా వెనుక ఇన్ని లింక్ లా?

మహేష్ సినిమా వెనుక ఇన్ని లింక్ లా?

పివిపి సంస్థలో రెండో సినిమా చేయాల్సిన అగ్రిమెంట్ మహేష్ బాబుకు వుంది. ఇది వాస్తవం. వంశీ పైడిపల్లి కథ ఒకటి ముందే ఓకె చేసి వుంచారు మహేష్ బాబు. ఇదీ వాస్తవమే. ఈ రెండూ కలిసి ఓ సినిమాగా రూపుదిద్దుకుంటాయని ఆ మధ్య వరకు కచ్చితంగా వినిపించింది. కానీ నిన్న, మొన్న ఈ సినిమా డవుట్ లో పడిందని, పివిపికి బదులుగా దిల్ రాజు నిర్మించే అవకాశం వుందని వార్తలు వెలువడ్డాయి. 

దీనికి కారణం ఈ ప్రాజెక్టు పట్ల మహేష్ తరపున వ్యవహారాలు అన్నీ చక్క బెట్టే నమ్రత అంత ఆసక్తిగా లేకపోవడమే అని వదంతులు వినిపించాయి. అయితే అసలు రీజన్ వేరే వుందని ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. దర్శకుడు వంశీ పైడిపల్లికి, నిర్మాత పివిపి కి మధ్య అంతగా పొసగడం లేదని తెలుస్తోంది. ఈ సంగతి తెలిసి, వంశీ పైడిపల్లి ప్రోత్సాహంతోనే దిల్ రాజు సీన్లోకి ఎంటర్ కావాలని ప్రయత్నిస్తున్నారని, ఆ మేరకు ఫీలర్లు బయటకు పంపారని వినికిడి. 

మరోపక్క మహేష్ బాబుకు కమిట్ మెంట్లు ఎక్కువ వున్నాయి. అశ్వనీదత్, కేఎస్ రామారావు, నిరంజన్ రెడ్డి, కెఎల్ నారాయణ, పివిపి ఇలా చాలా మందికి సినిమాలు చేయాల్సి వుంది. ఈ సినిమాలు అన్నీ ఎప్పటికి అయ్యేను. అందుకే ఇద్దరు ఇధ్దరు నిర్మాతలను కలిపి సినిమాలు సెటప్ చేయాలని మహేష్ అనుకుంటున్నారట.

ఆ విధంగానే పివిపికి మరో నిర్మాతను జాయింట్ చేస్తా అన్నారట. దానికి పివిపి అంగీకరించడం లేదని తెలుస్తోంది. దాంతో వంశీ పైడిపల్లి సినిమాను అశ్వనీదత్ కు, మరో నిర్మాతకు కలిపి చేసే ఆలోచనలో మహేష్ వున్నట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?