మహేష్-కొరటాల సినిమా కాస్త ఆలస్యం?

ఒక సినిమా సెట్ మీద వుండగానే మరో సినిమాను ఫైనల్ చేస్తూ, చకచకా గ్యాప్ లు లేకుండా ముందుకు వెళ్తున్నాడు హీరో మహేష్ బాబు. అదే విధంగా, ప్రస్తుతం చేస్తున్న మురగదాస్ సినిమా సెట్…

ఒక సినిమా సెట్ మీద వుండగానే మరో సినిమాను ఫైనల్ చేస్తూ, చకచకా గ్యాప్ లు లేకుండా ముందుకు వెళ్తున్నాడు హీరో మహేష్ బాబు. అదే విధంగా, ప్రస్తుతం చేస్తున్న మురగదాస్ సినిమా సెట్ మీద వుండగానే కొరటాలశివ-డివివి దానయ్య సినిమా ఫైనల్ చేసేసాడు. మురగదాస్ సినిమా జనవరితో పూర్తి కాగానే ఫిబ్రవరి నుంచి కొరటాల శివ సినిమా స్టార్ట్ అవతుందని ఇప్పటి వార్తలు వినవచ్చాయి. 

అయితే కొరటాల శివ సినిమా షూట్ కాస్త ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. బహుశా ఆ సినిమా సమ్మర్ అయిన తరువాత ప్రారంభం అయినా ఆశ్చర్యం లేదు. మురగదాస్ సినిమా షెడ్యూల్ ప్రకారమే ముందుకు వెళ్తోంది కానీ, మహేష్ ఆ సినిమా టాకీ నుంచి బయటపడే సరికి ఫిబ్రవరి వస్తుందని వినికిడి. ఆ తరువాత మహేష్ కాస్త గ్యాప్ తీసుకునే అవకాశం వుందంటున్నారు. 

కొరటాల శివ సినిమాతోనే 2017 ఫినిష్ అవుతుందని టాక్. ఎందుకంటే ఇంతకు ముందు ఫిబ్రవరిలో కొరటాల శివ సినిమా స్టార్ట్ చేసి, సెప్టెంబర్ నాటికి మరో సినిమా స్టార్ట్ చేస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు అలా చేయడం లేదని తెలుస్తోంది.