Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ కు 25, కొరటాలకు 14

మహేష్ బాబు,కొరటాల శివ సినిమాకు సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్ డేట్ లు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతవరకు తెలుగులో ఏ హీరోకి ఇవ్వనంత పారితోషికం, ఏ డైరక్టర్ కు ఇవ్వనంత రెమ్యూనిరేషన్ ఈ సినిమాతో మహేష్ కు కొరటాల శివకు అందనున్నాయి. 

మురగదాస్ సినిమాకు 20, బ్రహ్మోత్సవం సినిమాకు 22 కోట్లు తీసుకున్న మహేష్ బాబు ఈ సినిమాకు 25 కోట్లకు నిర్మాత దానయ్యతో అగ్రిమెంట్ కుదర్చుకున్నట్లు వినికిడి. మురగదాస్ సినిమా తరువాత మహేష్ కు తమిళనాడు మార్కెట్ కూడా బాగా పెరుగుతుందని, అందువల్ల 25 పెద్ద అమౌంట్ కాదని నమ్రత ఈ డీల్ సెట్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Click Here For Video

గతంలో ఏ డైరక్టర్ కూడా పది కోట్లకు మించి తీసుకోలేదు. త్రివిక్రమ్ అ..ఆ కు 9 కోట్లు, వివి వినాయక్ అల్లుడు శీనుకు 10 కోట్లు తీసుకున్నట్లు అనధికార వార్తలు వున్నాయి. అలాంటిది కొరటాల శివ 14 కోట్లు అంటే రికార్డే. కేవలం హీరో ప్లస్ డైరక్టర్ కే 40 కోట్లు ఖర్చయిపోతే నిర్మాణానికి మరో నలభై కోట్లు కావాలి. ఆపై వడ్డీలు, పబ్లిసిటీ అన్నీ కలుపుకుని, 90 దాటేస్తుంది సినిమా ఖర్చు. మరి ఎంత మార్కెట్ చేయాల్సి వుంటుందో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?