Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ మరీ అంత పట్టుపట్టాడా?

మహేష్ మరీ అంత పట్టుపట్టాడా?

సినిమా నాణ్యత మీద కన్నా, విడుదల టైమింగ్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మన హీరోలు. ఇటు రెండు వారాలు, అటు రెండు వారాలు బరిలో ఎవరు పోటీకి రాకుండా చూసుకుని కానీ రంగంలోకి దిగడం లేదు. అలా దిగి..బస్తీమే సవాల్..మా చుట్టూ ఎవరు లేరు..అని ఫీలైపోతున్నారు. బ్రహ్మోత్సవం సినిమా విడుదల విషయంలో మహేష్ బాబు ఇలాంటి వత్తిడి కార్యక్రమం బాగా చేపట్టారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. 

త్రివిక్రమ్ సినిమా అ..ఆ వాస్తవానికి మే మొదటి వారంలో విడుదల కావాల్సి  వుంది. కానీ సూర్య 24 సినిమా రావడంతో వెనక్కు వెళ్లాలనుకున్నారు. అంతే మహేష్ బాబు అడ్డం పడిపోయాడట. ఇటు 13న కానీ అటు 27 న కానీ రావడానికి వీల్లేదని చాలా వత్తిడి చేసాడట. అప్పటికీ అ..ఆ నిర్మాత రాధాకృష్ణ ఏమయితే అయింది విడుదల చేసేద్దామనే అనుకున్నారట. కానీ దర్శకుడు త్రివిక్రమ్ అడ్డం పడ్డారట. తనకు మహేష్ తో వున్న స్నేహం దెబ్బతింటుందని, వద్దని ఆయన కూడా వత్తిడి చేసారట. 

దీంతో చేసేది లేక రాధాకృష్ణ జూన్ ఫస్ట్ వీక్ కు వెళ్లక తప్పలేదు. అప్పటికే టేబుల్ ప్రాఫిట్ లో వున్న సినిమా బ్రహ్మోత్సవం. కనీసం ఆరు కోట్లు డెఫిసిట్ లో వున్న సినిమా అ..ఆ. ఈ విషయాన్ని మహేష్ కు వివరించే ప్రయత్నం చేసినా వినలేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద పెద్ద హీరోల వ్యవహారాలు ఇలా వుంటాయని అర్థమవుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?