Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ ను చూసి నేర్చుకోవాలి

మహేష్ ను చూసి నేర్చుకోవాలి

ఆడ లేకపోతే మద్దెల ఓటిది అనడం ఆనాటి సంగతే కాదు, ఈ నాటి వ్యవహారం కూడా. ముఖ్యంగా టాలీవుడ్ హీరోల దగ్గర ఈ వైనం కనిపిస్తుంటుంది. హీరోయిన్, కమెడియన్, డైరక్టర్, టాప్ టెక్నీషయన్లు, నిర్మాత పెట్టుబడి తీసుకుని సినిమా చేసారు. హిట్ అయితే ఇక హీరోలు కాలర్ ఎగరేస్తారు. అదే ఫట్ మంటే మాత్రం ఎవర్ని బకరా చేద్దామా అని చూస్తారు. తాము వెంటనే సినిమాలు సంపాదించుకుంటారు. కానీ దర్శకుడిని మాత్రం నిర్మొహమాటంగా బలి చేస్తారు. ఆ విషయంలో మహేష్ చాలా వరకు బెటర్. ఆగడు వంటి డిజాస్టర్ ఇచ్చానా, దర్శకుడు శ్రీను వైట్ల వైపు వేలు చూపించలేదు. ఓ ప్రయోగం చేసాం..క్లిక్ కాలేదు లాంటి మాటలే మాట్లాడాడు.

కానీ ఇప్పుడు కిక్ 2 తరువాత రవితేజ మాత్రం తప్పంతా సురేందర్ రెడ్డిదే అన్నట్లు మాట్లాడతున్నాడు. లెంగ్త్ ఎక్కువైందని ముందే తెలుసు, సురేందర్ నా మాట వినలేదు అంటున్నాడు. మరి అదే సురేందర్ నే కదా, పది కోట్ల మేరకు వున్న రవితేజ మార్కెట్ ను పాతిక కోట్లకు పెంచాడు కిక్ సినిమాతో. అప్పుడు రవితేజ ఘనత, ఇప్పుడు సురేందర్ రెడ్డి తప్పునా?

నాగార్జున కూడా ఇదే టైపు. భాయ్ ప్లాప్ తరువాత దర్శకుడు వీరభ్రదమ్ చౌదరిని తప్పు పట్టని సందర్భం లేదు. వీరభద్రమ్ ను ఎంత అవమాన పర్చాలో అంతా చేసాడు. ఏం స్క్రిప్ట్ విన్నది నాగ్ నే కదా...విడుదలకు ముందు సినిమా గురించి గొప్పలు చెప్పింది నాగ్ నే కదా. గెటప్ డిఫరెంట్ గా తయారుచేసుకున్నది ఆయనే కదా. కానీ బలయ్యింది వీరభ్రదమ్ నే. ఇప్పటికి ఇంకా సినిమా రెడీ కాలేదు నాగ్ పుణ్యమా అని. ఇలాంటి హీరోలంతా మహేష్ లా మాట్లాడడం నేర్చుకోవాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?