Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

మహేష్ 'రియల్' అడాప్షన్?

మహేష్ 'రియల్' అడాప్షన్?

మహేష్ బాబు వెళ్లక వెళ్లకు బుర్రిపాలెం వెళ్లారు.. కానీ దానిపై బోలెడు విమర్శలు తప్పడం లేదు. అసలు ఆయన వెళ్లింది బుర్రిపాలెం కోసమే కాదట.. తను బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్ ను చూడాలన్న కార్యక్రమం ఒకటి ముందుగానే ఫిక్స్ అయిందట. అయితే ఎలాగూ అక్కడి దాకా వెళ్తున్నాం కదా.. పనిలో పని బుర్రిపాలెం కూడా చూసి వచ్చేస్తే, విడుదల కాబోయే బ్రహ్మొత్సవం సినిమాకు మైలేజీ వుంటుదని జాయింట్ చేసారట. 

ఈ ముక్క బావ జయదేవ్ చెవిలో వేస్తే, ఎందుకంటే ఆయన కదా ఈ అడాప్షన్ కు సూత్రధారి..ఆయనేమో రుణాల చెక్కుల పంపిణీ తదితర వ్యవహారాలను ప్లాన్ చేసారట. సుమారు నాలుగువందల మంది పోలీసులు కేవలం మహేష్ పర్యటన కోసం వినియోగించబడ్డారట. 

గుంటూరు ప్రాంతంలో కీలకమైన చోట నిర్మాణ మవుతున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా వుంటున్నారు. ఈ ప్రాజెక్టు ప్రకటనను కూడా ఇటీవలే రూపొందించారు.. ఫ్లాప్ సినిమాల డైరక్టర్ గా ముద్రపడిన మెహర్ రమేష్ ఈ ఏడ్ ను డైరక్ట్ చేసారని వినికిడి. 

మొత్తం మీద వెళ్లక వెళ్లక బుర్రిపాలెం వెళితే, శ్రీమంతుడి టైమ్ లో పబ్లిసిటీ కోసమని ప్రకటించారని, బ్రహ్మోత్సవం టైమ్ లో పబ్లిసిటీ కోసం వెళ్లి వచ్చారని, పనులు చేయాలంటే మరో సినిమా రావాలేమో అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?