‘1 నేనొక్కడినే’ చిత్రాన్ని ఆంధ్ర ప్రేక్షకులు తొలి రోజే రిజెక్ట్ చేసారు. మహేష్‌కి ఉన్న తిరుగులేని ఫాలోయింగ్ వల్ల ఈ చిత్రం యుఎస్‌లో మిలియన్ డాలర్లు సాధించినా కానీ ఇక్కడ మాత్రం డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. సంక్రాంతి సెలవుల్లో కలెక్షన్లు ఏమైనా బెటర్ అయితే నష్టాలు కాస్త తగ్గుతాయి కానీ లేదంటే భారీ నష్టం తప్పదు.
వెరైటీ ప్రయత్నం చేయబోయి మహేష్ పరాజయాన్ని చవిచూసాడు. నటుడిగా అతను చాలా అద్భుతమైన ప్రతిభ కనబర్చినా కానీ సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకోవడంలో ఈ చిత్రం విఫలమైంది. దర్శకుడు సుకుమార్ ఒక సాధారణ రివెంజ్ కథని తెలివిగా చూపించే ప్రయత్నంలో కన్ఫ్యూజ్ చేసి పారేసాడు.
ఫలితంగా ఈ చిత్రం కమర్షియల్‌గా ఫెయిల్ అయింది. ఈ టైమ్‌లో మహేష్ మరో ప్రయోగం చేయడానికి సాహసిస్తాడా అనే అనుమానం కలుగుతోంది. మణిరత్నం దర్శకత్వంలో మహేష్, నాగార్జున హీరోలుగా సినిమా వస్తుందని ప్రచారం జరుగుతోంది. కానీ 1 నేనొక్కడినే తర్వాత వెంటనే మహేష్ ఇలాంటి ప్రయోగాల జోలికి పోకపోవచ్చు.