మహేష్ యూనిట్ కు నోటీసులు?

భరత్ అనే నేను మరో నెలలో పూర్తవుతుంది. ఆ మలి నెలలో విడుదలవుతుంది. ఆ తరువాత అశ్వనీదత్, దిల్ రాజు కాంబో వంశీ పైడిపల్లి సినిమా స్టార్ట్ అవుతుంది. ఇదీ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న…

భరత్ అనే నేను మరో నెలలో పూర్తవుతుంది. ఆ మలి నెలలో విడుదలవుతుంది. ఆ తరువాత అశ్వనీదత్, దిల్ రాజు కాంబో వంశీ పైడిపల్లి సినిమా స్టార్ట్ అవుతుంది. ఇదీ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మహేష్ బాబు లైన్ అప్. ఆ తరువాత వీలైతే త్రివిక్రమ్ సినిమా. అయితే వంశీ పైడిపల్లి సినిమా అంత సులువుగా పట్టాలు ఎక్కుతుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఎందుకంటే ఈ సినిమా విషయంలో చెన్నయ్ కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ అలాగే వుంది. అది వెకేట్ కాలేదు. వంశీ పైడిపల్లి తయారుచేసిన స్క్రిప్ట్ పై సర్వహక్కులు తమకే వున్నాయని అంతకు ముందు ఈ సినిమాను నిర్మించాలని ప్లాన్ చేసిన పీవీపీ నిర్మాణ సంస్థ కోర్టుకు వెళ్లింది. స్టే ఇచ్చారు. ఆ స్క్రిప్ట్ ఇప్పుడు కోర్టులో సీల్డ్ కవర్ లో వున్నట్లు బోగట్టా. 

హక్కులు ఎవరికి దఖలు పడతాయన్న వాదనలు అలా వుంచితే, విషయం ఒకసారి కోర్టుమెట్లు ఎక్కిన తరువాత, నిర్ణయం అక్కడ వెలువడాల్సిందే. మరి ఆ దిశగా ప్రస్తుత నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్ ప్రయత్నాలు చేస్తున్నట్లులేదు. 

ఈ వ్యవహారం ఇలావుంటే రీసెంట్ గా వంశీ పైడిపల్లి సినిమాకు పని చేయబోయే 14 మంది టెక్నీషియన్లకు కూడా నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్ పై హక్కుల వ్యవహారం కోర్టు పరిథిలో వుందని, అలాంటి సినిమాకు మీరు వర్క్ చేస్తున్నారని తెలిసింది కాబట్టి, అది కోర్టు పరిథికి లోబడి వుంటుందని గమనించాలని, కంటెప్ట్ ఆఫ్ కోర్టు అవుతుందా అన్నది గమనించుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది.

ఇలా నోటీసులను కొందరు డైరక్షన్ డిపార్ట్ మెంట్ జనాలు, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరక్టర్, ఇంకా మరి కొందరికి పంపినట్లు తెలిసింది. మరి దీనికి వారెలా స్పందిస్తారో? దిల్ రాజు, వంశీ పైడిపల్లి, అశ్వనీదత్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.