Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్.. పివిపి ఇద్దరు తప్పు చేసారు

మహేష్.. పివిపి ఇద్దరు తప్పు చేసారు

వ్యాపారం దగ్గర ఎమోషన్లు పనికిరావు...అడ్జస్ట్ మెంట్లు, మొహమాటాలు అస్సలు పనికిరావు. పివిపి ఎమోషన్ అయ్యారు..మహేష్ మొహమాట పడ్డారు. ఫలితం బ్రహ్మోత్సవం. అసలు బ్రహ్మోత్సవం కథ ఎలా పుట్టింది.? ఎక్కడికి వెళ్లింది..ఎక్కడ తేలింది? కాస్త ఆసక్తికరమే.

రాజస్థాన్ లో ఓ కుటుంబం దాదాపు ఏడు తరాల తమ కుటుంబానికి సంబంధం వున్న వారందరి వివరాలు నమోదు చేసి, జాగ్రత్త చేస్తోందని ఓ వార్త పత్రికల్లో వచ్చింది. అంతే భలే ఇన్సిపిరేషన్ గా అనిపించింది దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు. కుటుంబ బాధవ్యాలంటే ప్రాణం ఇచ్చేస్తాడు ఆయన. వెంటనే రాజస్థాన్ లో వాలిపోయి..వైనం సేకరించి, ఓ లైన్ అల్లేసుకున్నాడు. ఓ కుర్రాడు ఏడేడు తరాల వారి వివరాలు పట్టుకుని దేశం తిరగడం..అదీ లైన్.

దీన్ని పట్టుకుని ముందుగా వెళ్లింది ఎన్టీఆర్ దగ్గరకు..ప్రొడ్యూసర్ బోగవిల్లి ప్రసాద్. ఎన్టీఆర్ లైన్ విని..ఇది సెట్ అయ్యే వ్యవహారం కాదు అనేసాడు. ఇలాంటి రోడ్ మూవీ టైపు నడవడం కష్టం అన్నాడు. పైగా ఇంత సెంటిమెంట్ తనకు వర్కవుట్ కాదన్నాడు. లేదు బృందావనంలో అయ్యింది కదా అన్నాడు ఇతగాడు. అక్కడ కమర్షియల్ యాంగిల్ చాలా వుంది. ఇక్కడ లేదు కదా అన్నాడు ఎన్టీఆర్. ఎన్నిసార్లు తిరిగినా అదే మాట. ఆఖరికి వెనక్కు వచ్చాడు.

వన్ ఫైన్ మార్నింగ్ మహేష్ కు లైన్ చెప్పాడు. ఇంటర్వెల్ బ్యాంగ్..ఏడుతరాలు..క్లయిమాక్స్.. మహేష్ కాస్త కదిలాడు. సీతమ్మ వాకిట్లో బాగానే చేసాడు కదా..సరే అని పివిపి దగ్గరకు పంపాడు. దసరా రోజు పీవీపి దగ్గర సిటింగ్. పీవీపీ బిజినెస్ మ్యాన్ నే కానీ, కాస్త భావుకత, ఎమోషన్లకు కరిగే వ్యవహారం. ఈ లైన్ చెప్పగానే, చటుక్కున పడిపోయాడు. అంతే..ఇది మనం తీయాల్సిదే అన్నాడు. 

ఇంకేం..వ్యవహారం అలా కొలిక్కి వచ్చేసింది. కానీ సినిమా కొంతవరకు అయ్యే సరికి మహేష్ కు అప్పుడు కలిగింది అనుమానం. ఏంటీ సినిమా వేరే రూట్లో వెళ్తున్నట్లుంది? అని..కాస్త గ్యాప్..అప్పుడు జాయిన్ అయ్యారు ఫరుచూరి వెంకటేశ్వరరావు.  రావు రమేష్ భుజం మీద రావుగోపాలరావు కూర్చోవడం, ఇలాంటి చమక్కులు కొన్ని జోడించారు. అప్పటికే నలుగురైదుగురు రచయితలు స్క్రిప్ట్ పై వున్నారు. అంతమంది వంటగాళ్లు కలిసి వండేసారు.

అలా తయారైంది బ్రహ్మొత్సవం. ఇప్పుడు దీని వల్ల నీతి ఏమిటంటే, లార్జ్ స్కేల్ మార్కెట్ వున్న కమర్షియల్ హీరో మరీ మేధావితనం సినిమాలు చేయకూడదు..వన్ అయినా బ్రహ్మోత్సవమైనా. ఎంత ఎమోషన్లు లోపల వున్నా, వ్యాపారంలో వాటికి చొటివ్వకూడదు..అదీ సంగతి.

గతంలో శేఖఠ్ కమ్ముల పుణ్యమా అని ఎవిఎమ్ లాంటి భారీ సంస్థ మళ్లీ సినిమాలు తీయకుండా అయిపోయింది. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల కూడా అదే పుణ్యం కట్టుకున్నట్లు వుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?