తన ఊహల్లోంచి మాహిష్మతి రాజ్యాన్ని సృష్టించి, చూసుకోండని జనంపైకి వదిలాడు రాజమౌళి. ఒకటా రెండా మూడేళ్ల టెన్షన్. ఒకరు ఇద్దరు కాదు, రాజమౌళి, కీరవాణి ఇలా ఫ్యామిలీ మెంబర్లందరికీ. అందుకే ఒక్కసారిగా టోటల్ ఫ్యామిలీ మెంబర్లంతా విదేశాలకు ఆటవిడుపుగా వెళ్లిపోయారు.
రాజమౌళిది చాలా పెద్ద ఫ్యామిలీ. అందరికీ అనుబంధాలు, ఫ్యామిలీ బంధాలు ఎక్కువ. అందుకే అందరూ కలిసే సినిమా చేసారు. అందరూ కలిసే ఇప్పుడు విదేశాలకు వెళ్లారు. ఎక్కడికీ వెకేషన్ అన్నది కాస్త గోప్యంగానే వుంచారు. అందుకే సినిమా జనాలు మాహిష్కతి రాజ్యానికి వెళ్లివుంటారు అని చమత్కరిస్తున్నారు. ఓ నెల రోజులు రెస్ట్ తీసుకుని, అప్పుడు బాహుబలి పార్ట్ 2 మీదకు వస్తారు. మళ్లీ ఓ ఏడాది అవిశ్రాంతంగా పనిచేయడానికి.