అంటీ, కుర్రహీరో.. ఒక్కో స్టెప్పూ ముందుకు!

ఒకప్పుడు వీళ్లది అక్రమ సంబంధం అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. కట్ చేస్తే భర్త నుంచి విడాకులు తీసుకుంది మలైకా ఆరోరా. దీంతో అర్జున్ కపూర్ తో ఈమె బంధం సక్రమం కావడానికి అవకాశం…

ఒకప్పుడు వీళ్లది అక్రమ సంబంధం అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. కట్ చేస్తే భర్త నుంచి విడాకులు తీసుకుంది మలైకా ఆరోరా. దీంతో అర్జున్ కపూర్ తో ఈమె బంధం సక్రమం కావడానికి అవకాశం ఏర్పడింది. విడాకుల అనంతరం కొంత గ్యాప్ తర్వాత అర్జున్ తో విదేశాల్లో చుట్టేయడం మొదలుపెట్టింది మలైకా. అలా కనిపించీ కనిపించకుండా తిరిగారు. ఆ తర్వాత నెమ్మదిగా దేశీ మీడియా ముందుకు కూడా వచ్చేశారు.

అలా తమ బంధంలో ఒక్కో స్టెప్పూ వేసుకొంటూ వచ్చారు. ఇక ఇప్పుడు తమ బంధాన్ని ధ్రువీకరించడంలో కూడా వీళ్లు రెడీ అయిపోతున్నారని స్పష్టం అవుతోంది. ఈ విషయంలో మలైకా చొరవ తీసుకుంటున్నట్టుగా ఉంది. ఈమె తాజాగా తన మెడలోని చైన్ కున్న పెండెంట్  ఫొటోను షేర్ చేసింది.

దాని మీద ‘ఏఎం” అని ఉంది. ఏ అంటే అర్జున్ కపూర్, ఎం అంటే మలైకా అరోరా అనేది ఈ చిత్ర సందేశం అనేది స్పష్టం అవుతున్న విషయం. ఇదివరకూ కూడా పలువురు సెలబ్రిటీలు తమ రహస్య ప్రేమలను ఇలాగే పెండెంట్స్ తో, లాకెట్స్ తో తెలియజేశారు. తమ ప్రియాతిప్రియుల పేరులోని మొదటి అక్షరాలను ఇలా చూపిస్తూ వచ్చారు.

ఆ దశలో ఆ అక్షరాల అసలు అర్థం ఏమిటో వాళ్లు చెప్పరు. పరోక్షంగా అర్థం అయ్యేలా చేస్తారు. ఆ తర్వాత అసలు విషయాన్ని ప్రకటిస్తారు. బహుశా మలైకా, అర్జున్లు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్టుగా ఉన్నారు.