cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హీరోతో స‌హ‌జీవ‌నం.. ఆమెకు మ‌ళ్లీ పెళ్లిపై గాలి మ‌ళ్లిందా!

హీరోతో స‌హ‌జీవ‌నం.. ఆమెకు మ‌ళ్లీ పెళ్లిపై గాలి మ‌ళ్లిందా!

ఇటీవ‌ల ఒక ఫ్యాష‌న్ షోలో మ‌లైకా ఆరోరా చేసిన వ్యాఖ్య‌లు ఆమెకు మ‌ళ్లీ పెళ్లిపై గాలి మ‌ళ్లిందా.. అనే ఊహాగానాల‌కు తావిస్తోంది. భార‌తీయ శైలిలో పెళ్లి వ‌స్త్రాలంక‌ర‌ణ త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని అంటోంది మలైకా. అందులోనూ వైట్ వెడ్డింగ్ డ్ర‌స్ త‌న మ‌న‌సు దోచే అంశ‌మ‌ని మ‌లైకా చెప్పుకొచ్చింది.

అది కూడా తెల్ల‌ని పెళ్లి దుస్తుల్లో మెర‌వ‌డం అనేది త‌న మ‌న‌సును ఎంతో అల‌రించే అంశ‌మ‌ని మలైకా అంటోంది. ఇండియ‌న్ స్టైల్లో పెళ్లి దుస్తులు అంటేనే.. ఎంతో సూప‌ర‌ని, అందులో త‌న ప్రాధాన్య‌త మాత్రం వైట్ వెడ్డింగ్ అని అంటోంది మ‌లైకా!

మ‌రి ఈ మాట‌ల సారాంశం.. మలైకాకు పెళ్లి మీద మ‌ళ్లీ గాలి మ‌ళ్లడ‌మేనా? అనేది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అది కూడా కొన్నేళ్లుగా ఆమె అర్జున్ క‌పూర్ తో డేటింగ్ లో ఉంది. వీరిద్ద‌రూ స‌హ‌జీవ‌నం కూడా చేస్తున్నార‌నే ప్ర‌చారం ఉంది. అందుకు త‌గ్గ‌ట్టుగా వీరిద్ద‌రూ బోలెడ‌న్ని సంద‌ర్భాల్లో జాయింటుగా పిక్స్ పెడుతూ ఉంటారు.

అర్జున్ క‌పూర్ తో ఎఫైర్ నేప‌థ్యంలో మ‌లైకా త‌న మొద‌టి భ‌ర్త‌కు విడాకులు ఇచ్చింద‌నే ప్ర‌చార‌మూ సాగింది. చివ‌ర‌కు ఆ విడాకులు సెట్ కావడం, అర్జున్- మ‌లైకాలు జంట‌గా సాగిపోతూ ఉండ‌టం జ‌రుగుతోంది.

మ‌లైకా క‌న్నా అర్జున్ వ‌య‌సులో చాలా చిన్న‌వాడు. వీరిద్ద‌రి మ‌ధ్య‌న ఏజ్ గ్యాప్ ఇండియాలో చాలా విమ‌ర్శ‌ల‌కు తావిచ్చే అంశ‌మే. అయితే ఎవ‌రేమ‌నుకున్నా తాము భ‌య‌ప‌డేది లేద‌న్న‌ట్టుగా, త‌మ ప్ర‌పంచంలో వేరే వాళ్ల అభిప్రాయాల‌కూ తావులేద‌న్న‌ట్టుగా వీరు చాలా డేర్ గా సాగిపోతూ ఉన్నారు. 

మొద‌ట్లో వీళ్ల గురించి విమ‌ర్శించిన వాళ్లు కూడా.. త‌మ ప‌నిలో తాము ప‌డ్డారు. మ‌లైకా- అర్జున్ లు కూడా త‌మ ప‌ని తాము చూసుకుంటున్నారు. ఇలాంటి క్ర‌మంలో వివాహం, వ‌స్త్ర‌ధార‌ణ అంటూ మ‌లైకా మాట్లాడ‌టంతో, వీరిద్ద‌రూ పెళ్లి పీట‌లెక్కబోతున్నారా? మ‌లైకా కోరుకుంటున్న వైట్ వెడ్డింగ్ కు అర్జున్ సై అన‌బోతున్నాడా.. అనే అంశాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. అయినా.. పెళ్లి లేక‌పోయినా, ఎవ‌రేమ‌నుకున్నా అర్జున్- మ‌లైకాలు బిందాస్ గా ఉన్న‌ట్టున్నారు. అలాంట‌ప్పుడు ఇక పెళ్లెందుకబ్బా!

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!