మళ్లీ అదే కాంబినేషన్..?

బాలయ్య-బోయపాటి కాంబినేషన్ సినిమా ప్రకటన వచ్చేసింది. రాబోయే సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయితే, హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్ అవుతుంది. ఇలాంటి కాంబినేషన్ నే మరొకటి కూడా ప్లానింగ్ లో వున్నట్లు తెలుస్తోంది. బాలయ్యతో…

బాలయ్య-బోయపాటి కాంబినేషన్ సినిమా ప్రకటన వచ్చేసింది. రాబోయే సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయితే, హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్ అవుతుంది. ఇలాంటి కాంబినేషన్ నే మరొకటి కూడా ప్లానింగ్ లో వున్నట్లు తెలుస్తోంది. బాలయ్యతో పూరి జగన్నాధ్ పైసావసూల్ సినిమా తీసారు. కాస్ట్ ఫెయిల్యూర్ అయింది కానీ, మరీ కమర్షియల్ గా బ్యాడ్ సినిమా అనిపించుకోలేదు.

అప్పటి నుంచి తరచు పూరి జగన్నాధ్ తనకు బాలయ్య అంటే వున్న ఇష్టాన్ని చెబుతూనే వస్తున్నారు. ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం వుందని తెలుస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాధ్-విజయ్ దేవరకొండతో ఓ సినిమా ప్లాన్ చేసారు. అది స్టార్ట్ చేయాలి. పూర్తికావాలి. అలాగే బాలయ్య-బోయపాటి సినిమా ఫినిష్ కావాలి.

ఆ తరవాత బాలయ్య-పూరి కాంబినేషన్ సినిమా వుండేలా ఇప్పటి నుంచే ప్లానింగ్ ప్రారంభమైందని, ప్రాధమిక చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. అయితే ఒకటే అనుమానం, విజయ్ సినిమా కూడా ఇస్మార్ట్ లా హిట్ కొడితే పూరి మళ్లీ ఫుల్ గా ఫామ్ లోకి వచ్చేసినట్లు అవుతుంది. అప్పుడు కచ్చితంగా హీరోలు అంతా ఆయన కేసి చూస్తారు. మరి అప్పుడు కూడా బాలయ్యనే ఆప్షన్ గా వుంచుకుంటారా? అన్నది.

తన భయం.. రాష్ట్రంపై రుద్దితే ఎలా?