కొణిదెల నీహారిక. ఏక్టర్, ప్రొడ్యూసర్ నాగబాబు కుమార్తె. టీవీ షోల నుంచి వెబ్ సిరీస్ ల మీదుగా ఒకమనసు సినిమాతో తెరపైకి వచ్చింది. మంచి ఫెర్ ఫార్మర్ అనిపించుకుంది. కానీ మంచి హిట్ కొట్టలేకపోయింది. ఒక మనసు మూవీ ఇలా అవవడానికి సవాలక్ష కారణాలు. అక్కినేని ఫ్యామిలీ హీరోయిన్ సుప్రియ మెగా హీరో పవన్ కళ్యాణ్ తో ఎలాంటి మోడరన్ డ్రెస్ లు వేసుకుని, పక్కా కమర్షియల్ సినిమా చేసినా ఫరవాలేకపోయింది ఆ రోజుల్లో.
కానీ మెగా హీరోయిన్ మాత్రం తెరపైకి వచ్చేసరికి పక్కా క్లాస్ సినిమా చేయాల్సి వచ్చింది. సరే, అయిపోయిన ఆ సినిమా వ్యవహారం అలా వుంచితే, నీహారిక మరోసారి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుుస్తోంది. తొలి వెబ్ సిరీస్ అందించిన ప్రవీణ్ బ్రహ్మాండపల్లి డైరక్షన్ లోనే ఈ రెండో వెబ్ సిరీస్ కూడా వుంటుందని తెలుస్తోంది.
ప్రవీణ్ ఒక మనసు సినిమాకు కూడా డైరక్షన్ యూనిట్ లో పనిచేసారు. మళ్లీ మరో మాంచి యూత్ ఫుల్ ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లోనే ఈ వెబ్ సిరీస్ వుంటుందని తలుస్తోంది. మరి పెద్ద తెరపై మళ్లీ నీహారిక ఎంట్రీ ఎప్పుడు అన్నది ఇంకా తెలియడం లేదు.