జిల్ సినిమాతో కాస్త కొత్తగా ట్రయ్ చేద్దాం అనుకున్నాడు గోపీచంద్. కానీ జనం పెద్దగా యాక్సెప్ట్ చేయలేదు. గౌతమ్ నందాతో కూడా అలాగే మరో ప్రయత్నం చేసాడు. రెండు పాత్రలు వైవిధ్యం చూపించాలనుకున్నాడు. కానీ కుదరలేదు. దాంతో తనకు వచ్చిన యాంగ్రీ యంగ్ మెన్, సమాజంలో అన్యాయం, ఎదుర్కోవడం వంటి తనకు అచ్చివచ్చిన జోనర్ నే మళ్లీ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.
కొత్త దర్శకుడు చక్రవర్తితో హీరో గోపీచంద్ చేస్తున్న సినిమా పంతం. ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. చూస్తుంటే గోపీచంద్ తనకు పక్కాగా కలిసివచ్చిన, అచ్చి వచ్చిన కమర్షియల్ జోనర్ లోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. టీజర్ రొటీన్ గా వుందన్న సంగతి పక్కన పెడితే రిచ్ నెస్ కనిపిస్తోంది. కాస్త పొలిటికల్ టచ్ వున్న డైలాగులు వినిపించాయి.
ఫన్, యాక్షన్, డైలాగ్ పవర్, ఇలా అన్నీ ఒకేసారి టీజర్ లోకి చేర్చాలన్న తపనను డైరక్టర్ చూపించడం అన్నది ఒక విధంగా కరెక్ట్ యేమో కావచ్చు, కానీ, రొటీన్ టీజర్ అన్న ఫీల్ కలిగించే ప్రమాదం కూడా వుంది.