మామగారి బాటలో ఎన్టీఆర్

నాలుగు డబ్బులు వున్నప్పుడు జాగ్రత్త చేసుకోవాలన్నది ఈ కాలం తారల ఆలోచన. ఇలాంటి ఆలోచన లేకనే టాలీవుడ్ లోఒకప్పుడు వెలుగు వెలిగిన తారలు, తమ ఫాగ్ ఎండ్ లో నానా కష్టాలు అనుభవించారు. అయితే…

నాలుగు డబ్బులు వున్నప్పుడు జాగ్రత్త చేసుకోవాలన్నది ఈ కాలం తారల ఆలోచన. ఇలాంటి ఆలోచన లేకనే టాలీవుడ్ లోఒకప్పుడు వెలుగు వెలిగిన తారలు, తమ ఫాగ్ ఎండ్ లో నానా కష్టాలు అనుభవించారు. అయితే ఇప్పటి జనరేషన్ అలా కాదు. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. 

వేరే వ్యాపారాల్లో భాగస్వాములు కావడం, తమ సినిమాల నిర్మాణంలో పాలు పంచుకోవడం, ఇలా. నాగార్జున, చిరంజీవి, నిన్నటి తరంలో, రామ్ చరణ్, మహేష్ బాబు,ప్రభాస్, ఈ తరంలో ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్నవారే. ఇప్పుడు వీరి సరసన ఎన్టీఆర్ కూడా చేరినట్లు వార్తలు వినవస్తున్నాయి. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.

ఇటీవల కొన్ని కమర్షియల్, డొమస్టిక్ ఫ్లాట్ లు కొని వుంచాడని, రేటు మాట ఎలా వున్నా, అద్దెలు ఆదాయం బాగానే వస్తుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ మామగారు నార్నేశ్రీనివాసరావు, ఆయన తండ్రి నార్నే రంగారావు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఢక్కామక్కీలు తిన్నవారే. బీభీనగర్ ఫ్రాంతంలో ఈస్ట్ సిటీ వారిదే. బహుశా మామగారి సలహానో, అడుగుజాడనో ఎన్టీఆర్ కూడా అటే పయనిస్తున్నాడన్నమాట. మంచిదే.