టాలీవుడ్ పరిస్థితి ఎలా తయారైందీ అంటే, సినిమా హిట్ అయినా డబ్బులు రానంత. అమ్మినపుడు ఏరియాల వారీ ఎంత వస్తే అంతే దక్కుడు. తీరా చేసి సినిమా హిట్ అయినా, ఓవర్ ఫ్లోస్ ఇవ్వాలని స్పష్టంగా అగ్రిమెంట్ లు రాసుకున్నా, పైసా కూడా ఓవర్ ఫ్లో రావడం అన్నది గగనంగా మారిందట. చిన్న సినిమా అయితే సమస్యే లేదు. పెద్ద సినిమా అయినా అదే పరిస్థితి అంట. బాహుబలి లాంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కే ఓవర్ ఫ్లోస్ కట్టిన బయ్యర్లు ఒకరిద్దరు కూడా లేరట.
ఇక నాగ్ సినిమా మనం పెద్ద హిట్. మంచి పేరుతెచ్చుకుంది. అలాంటి సినిమాకు అన్ని ఖర్చులు పోను మిగిలంది కొటి రెండుకోట్లేనట. ఇంక మరేం లాభం సినిమాలు తీసి. ఇటీవల హిట్ అయిన బెంగాల్ టైగర్ నిర్మాత ఓవర్ ఫ్లోస్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారట. కానీ బయ్యర్లు బ్రేక్ ఈవెన్ అయినా వేరే ఖర్చులు చూపించడమో, ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదని చెప్పడమో చేస్తుంటే, ఏం చేయాలో అర్థం కాకుండా వుందట.
పక్కగా లెక్కలు తేలే ఓవర్ సీస్ లో కూడా ఇదే పరిస్థితి అని వినికిడి..లెక్కలు చూపించడానికే నెలలు పడుతోందట. తీరా చేసి చూపించినా, ముందుగానే ఏరియాల వారీ అమ్మేసాం, మాకు లాభం రాలేదు..మీకేం ఇస్తాం..ఏరియాలు కొనుక్కున్నవారికి వచ్చాయి అంటూ తప్పించుకునే మార్గాలు వెదుకుతున్నారట.
అదీ టాలీవుడ్ లో హిట్ అయిన సినిమా నిర్మాతల పరిస్థితి.