మనం సినిమా మాస్ సినిమాల మాదిరిగా మొదటి రోజే భయంకరంగా వసూళ్లు సాగించకపోయినా, స్టడీగా సాగడం పట్ల నాగ్ హ్యాపీగా వున్నాడట. ఈ సినిమాకు ముగ్గురు హీరోల రెమ్యూనిరేషన్ వదిలేస్తే మహా అయితే 15కోట్లకు మించి ఖర్చు కాదని అంచనా. ఎంత ప్రొడక్షన్ రిచ్ గా చేసినా, ఇంతకు మించి ఖర్చు కాదని అంటున్నారు సినిమా జనాలు.
అయితే ఈ సినిమా ప్రచారానికి మాత్రం నాగ్ బాగానే ఖర్చుచేసాడు. ఇప్పటకే మూడు రోజులకు కలిపి అయిదు కోట్ల వరకు షేర్ వచ్చిందని టాక్. ఓవర్ సీస్, శాటిలైట్ రైట్లు మాత్రమే అమ్మారు. పాజిటివ్ టాక్ బలంగా స్ప్రెడ్ అవుతున్నందున, రన్నింగ్ లో మంచి వసూళ్లు వస్తాయని నాగ్ భావిస్తున్నాడు.
15 కోట్లు వసూళ్లు సాగించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. పైగా మరో రెండు వారాల వరకు మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకునే సినిమా ఏదీ విడుదల కావడం లేదు. ఉలవచారు బిర్యానీ వచ్చేవరకు మనం దే హవా. అందువల్ల సి సెంటర్లలో అంతంతమాత్రంగా వున్నా ఆందోళన అవసరం లేదని నాగ్ తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది.