రామ్ గోపాల్ వర్మ వ్యవహారం తిక్కగా వుంటుంది కానీ ఒక్కోసారి భలే హల్ చల్ చేస్తుంది. సినిమాల వేలం అన్న కాన్సెప్ట్ ఇప్పుడు బాగానే వర్కవుట్ అవుతోందని తెలిసింది. జాగ్రత్తగా ప్లాన్ చేస్తే డబ్బులు బాగా వచ్చే అవకాశం వుందని మంచు విష్ణు సినిమాతో రుజువైంది. ఆ సినిమాకు బాగానే ఆపర్ లు వచ్చినట్లు తెలుస్తోంది. సరైన స్లాట్ చూసి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
తొలిసారి జనం వ్యక్తిగతంగా ఈ వ్యాపారంలోకి దిగారు కాబట్టి, వారికి వీలయినంత లాభం చేయడం ద్వారా ఈ కొత్త స్కీమ్ ను నిలబెట్టాలన్నది ఆర్జీవీ అండ్ విష్ణు ప్లాన్. అందుకే ఆ విధంగా పావులు కదుపుతున్నారు. అయితే ఇది సినిమాకు రెవెన్యూ పరంగా బాగుంది కాబట్టి, త్వరలో మంచు మనోజ్ సినిమా కరెంట్ తీగ ను కూడా ఈ విధంగానే వేలానికి పెడతారని తెలుస్తోంది.
ఈ సినిమాను కూడా వేలం ద్వారానే విడుదల చేయాలని మంచు విష్ణు డిసైడ్ అయిపోయాడట. పారదర్శకంగా చెల్లింపులు చేస్తే, ఈ స్కీమ్ బాగానే వర్కవుట్ అయ్యేటట్లు వుంది. సినిమా వ్యాపారంలోకి దిగాలనే ఔత్సాహికులకు కొదవ లేదు కాబట్టి, కొన్నాళ్ల పాటు ఈ వ్యవహారం సాగే అవకాశం వుంది.