ఏప్రియల్ లో జెర్సీ, ‘దళపతి’

సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న రెండు సినిమాలు ఒకేనెలలో విడుదల కాబోతున్నాయి. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరక్షన్ ల నిర్మిస్తున్న సినిమా జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో పీరియాడిక్ ఫిల్మ్ గా…

సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న రెండు సినిమాలు ఒకేనెలలో విడుదల కాబోతున్నాయి. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరక్షన్ ల నిర్మిస్తున్న సినిమా జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో పీరియాడిక్ ఫిల్మ్ గా తయారవుతోందీ సినిమా.

అలాగే శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ ఢైరక్షన్ లో తయారవుతున్న సినిమా ఒకటి వుంది. దళపతి అన్నది వర్కింగ్ టైటిల్ గా వినిపిస్తోంది. ఇప్పడు ఈ రెండు సినిమాలను మూడువారాల గ్యాప్ లో ఒకేనెలలో విడుదల చేయబోతున్నారు.

ఏప్రియల్ వీక్ లో ఒకటి, లాస్ట్ వీక్ లో మరోటి విడుదల చేయాలని నిర్ణయించారు. ఈసారి సమ్మర్ ఫుల్ టైట్ గా వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేష్ సినిమా మహర్షి డేట్ కూడా ఇంకా రాలేదు. మీడియం సినిమాలు చాలా మేకింగ్ లో వున్నాయి.

అందుకే ముందుగా రుమాలు వేసేయాలని సితార ఎంటర్ టైన్ మెంట్స్ డేట్ లు ప్రకటించేస్తోంది.

తెలంగాణ రాజ్యానికి రాజు ఎవరో తెలుసా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్