థ్రిల్లర్ లు క్యూట్ గా వుండవు. ప్రేమ కథలు అయితే ఆ పదం వాడుకోవచ్చు. కానీ థ్రిల్లర్ ను, ప్రేమ కథను కలిపి, క్యూట్ లుక్ తో చూపించే ప్రయత్నం చేస్తున్నదో చిన్న సినిమా. సీత అన్నది టైటిల్. రాముని కోసం అన్నది కంటిన్యూ ట్యాగ్ లైన్.
ఓ సున్నితమైన ప్రేమ కథను, ఓ హర్రర్ థ్రిల్లర్ ను కలిపి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కొత్త నటులు శరత్ శ్రీరంగం, కారణ్య బాల నటిస్తున్న ఈ సినిమాను అనిల్ గోపి రెడ్డి రూపొందిస్తున్నారు.
సినిమా ట్రయిలర్ ఇటీవల విడుదలయింది. ఇండస్ట్రీ సర్కిళ్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుందీ ట్రయిలర్. లైన్ కొత్తది కాదు అని తెలుస్తూనే వుంది. హీరోయిన్ ను ఆదుకునేందుకు హీరో రావడం.
అయితే కథ చెప్పే విధానం దగ్గర కాస్త సున్నితత్వం, కొత్తదనం కొసం ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. ఈవారం విడుదలవుతున్న ఈ సినిమాతో ఎలాగైనా దర్శకుడిగా నిర్మాతగా నిలబడాలని అనిల్ గోపిరెడ్డి ప్రయత్నిస్తున్నారు.