Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మరో హాట్‌ షాక్‌కి ఐష్‌ రెడీ.?

మరో హాట్‌ షాక్‌కి ఐష్‌ రెడీ.?

43 ఏళ్ళ ఐశ్వర్యారాయ్‌.. ఇప్పటికీ ఇరవయ్యేళ్ళ అందాల భామలతో 'గ్లామర్‌' విషయంలో పోటీ పడుతూనే వుంది. ఇటీవల వచ్చిన 'ఏ దిల్‌ హై ముష్కిల్‌' సినిమాలో ఐష్‌ హాట్‌ హాట్‌గా కన్పించి అందర్నీ విస్మయానికి గురిచేసింది. దానికి కొనసాగింపుగా ఐష్‌ మరో హాట్‌ మూవీకి రెడీ అవుతోందట. 

ఇటీవలి కాలంలో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన చిత్రం 'పర్‌చేద్‌'. రాధికా ఆప్టే చాలా బోల్డ్‌గా (న్యూడ్‌గా) నటించింది ఈ చిత్రంలో. అయితే ఆ న్యూడ్‌ సీన్స్‌ ఇక్కడ రిలీజ్‌ కాలేదుగానీ, విదేశీ వేదికలపై (చిత్రోత్సవాల్లో) ప్రదర్శితమవడంతో, ఆ వీడియోలు లీక్‌ అయ్యాయనుకోండి.. అది వేరే విషయం. ఆ 'పర్‌చేద్‌' దర్శకురాలు లీనాయాదవ్‌, ఐశ్వర్యారాయ్‌తో ఓ సినిమా చెయ్యాలనుకుంటోందట. అదీ అసలు సంగతి. 

గతంలో లీనా యాదవ్‌, ఐశ్వర్యారాయ్‌తో 11 ఏళ్ళ క్రితం 'శబ్ద్‌' అనే సినిమా తెరకెక్కించింది. ఆ తర్వాత మళ్ళీ ఐష్‌తో సినిమా చేసేందుకు సమాయత్తమవుతోన్న లీనా, ఓ హాట్‌ కంటెంట్‌ని కూడా రెడీ చేసిందనే ప్రచారం జరుగుతోంది. సహజత్వానికి దగ్గరగా వుండే సినిమాలే చేయాలనుకుంటున్న లీనా, సహజత్వం పేరుతో బోల్డ్‌నెస్‌ని తెరపై చూపిస్తుండడంతో ఆటోమేటిక్‌గా వివాదాలు చుట్టుముడుతున్నాయి. మరి, ఐష్‌తో లీనా చేయనున్న సినిమా కూడా బోల్డ్‌ కంటెంట్‌తోనే వుంటుందా.? వేచి చూడాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?