మరో మెగా హీరో ఎంట్రీ రేపే

టాలీవుడ్ లో మెగా హీరోలకు కొదవలేదు. ఇప్పటికే అరేడుగురు వున్నారు. ఇప్పుడు మరో హీరో కూడా సెట్ మీదకు వస్తున్నాడు. ఇప్పటికే ప్రకటించిన ప్రాజెక్టును ఇప్పుడు సెట్ మీదకు తీసుకెళ్తున్నారు. మైత్రీమూవీస్ పతాకంపై, సుకుమార్…

టాలీవుడ్ లో మెగా హీరోలకు కొదవలేదు. ఇప్పటికే అరేడుగురు వున్నారు. ఇప్పుడు మరో హీరో కూడా సెట్ మీదకు వస్తున్నాడు. ఇప్పటికే ప్రకటించిన ప్రాజెక్టును ఇప్పుడు సెట్ మీదకు తీసుకెళ్తున్నారు. మైత్రీమూవీస్ పతాకంపై, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో, సుకుమార్ అసిస్టెంట్ తయారుచేసే సినిమా షూటింగ్ రేపు ప్రారంభం కాబోతోంది.

సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా సుకుమార్ అసిస్టెంట్ సానా బుచ్చిబాబు దర్శకత్వం వహించే ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందిస్తారు.

వైష్ణవ్ తేజ్ సినిమా రంగప్రవేశం చిరకాలంగా వార్తల్లో వుంటూ వస్తోంది. ఆఖరికి కొన్నాళ్ల క్రితం ప్రాజెక్టు ఫైనలైజ్ అయింది. ఇప్పుడు షూట్ స్టార్ట్ కాబోతోంది. సుకుమార్ తన సహాయకులను డైరక్టర్లుగా మారుస్తూ, తన నిర్మాణ భాగస్వామ్యంలో రెండు సినిమాలు ప్లాన్ చేసారు. అందులో ఇది ఒకటి. మరో సినిమా గీతా 2 బ్యానర్ లో నితిన్ హీరోగా ప్రారంభం కావాల్సి వుంది.

పవన్ ఒంటరిగా పోటీచేస్తే ఎవరికి లాభం?

స్పైడర్.. అజ్ఞాతవాసిల సరసన ఎన్టీఆర్-కథానాయకుడు!