ఎమ్ ఎస్ రాజును గుల్ల చేసేసింది వాన సినిమా. కన్నడంలో పెద్ద హిట్ అని మచ్చటపడి తెలుగులోకి తెస్తే, లాభాలకు నీళ్లు వదిలేయాల్సి వుంది. ఇప్పుడు మళ్లీ మరో వాన సినిమా వస్తోందట.
దర్శకుడు తేజ చాన్నాళ్ల తరువాత మరోసారి డైరక్షన్ కు దిగారు. ఈ సినిమా మూడు వంతులకు పైగా వానలోనే జరుగుతుందట. అయితే వానాకాలంలో, లేదంటే నీళ్ల టాంకర్లతొ సరిపెట్టుకుని సినిమా ఫినిష్ చేయాలని చూస్తున్నారట.
వానాకాలం చాలా దూరం వుంది కాబట్టి, భారీ నీళ్ల ట్యాంకర్లే బెస్ట్ అనుకుంటున్నాట. ఇద్దరు కొత్త హీరోలు నటించే ఈ సినిమా పేరు హోరా హోరీ..అంతకన్నా వాన సినిమా కాబట్టి వానహోరు అనో, ఒట్టి హోరు అని పెట్టాల్సిందేమో?