మారుతి వెరైటీ ఏడ్స్

మారుతి నిర్మాణ భాగస్వామ్యంలో లండన్ బాబులు సినిమా వస్తోంది. 17న విడుదలవుతున్న ఈ సినిమాలో విజయవాడలోని ప్రముఖ వ్యాపార సంస్థ స్వీట్ ఇండియా వారసుడు రక్షిత్ హీరోగా ఈ సినిమాను నిర్మించారు. స్వాతి రెడ్డి…

మారుతి నిర్మాణ భాగస్వామ్యంలో లండన్ బాబులు సినిమా వస్తోంది. 17న విడుదలవుతున్న ఈ సినిమాలో విజయవాడలోని ప్రముఖ వ్యాపార సంస్థ స్వీట్ ఇండియా వారసుడు రక్షిత్ హీరోగా ఈ సినిమాను నిర్మించారు. స్వాతి రెడ్డి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఓ తమిళ సినిమా ఆధారం. చిన్ని కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా పబ్లిసిటీ కోసం రెండు వెరైటీ ప్రకటనలు మారుతి ఆలోచనల్లోంచి పుట్టుకువచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో భయంకరంగా పాపులర్ అయిన లలిత జ్యూవెలర్స్ ప్రకటనలను ఇమిటేట్ చేస్తూ ఈ రెండు విడియోలను తయారుచేసారు. అచ్చంగా లలిత జ్యూవెలర్స్ యజమాని మాదిరగా కనిపించే నటుడు అజయ్ ఘోష్ ఈ ప్రకటనల్లో పాల్లొన్నారు. ఒక్కసారి లండన్ బాబులు ట్రయిలర్ చూసి, దాన్ని మిగిలిన ట్రయిలర్లతో పోల్చి చూసుకుని, ఆపై సినిమా చూడాలని అపీల్ చేయడం ఓక ప్రకటన.

సమయం విలువైనది. ఏదో సినిమా చూసి వేస్ట్ చేసుకోకుండా లండన్ బాబులు చూడమంటూ మరో ప్రకటన. ఈ రెండు ప్రకటనలు చూడగానే లలిత జ్యూవెలర్స్ ప్రకటనలు కళ్ల ముందుకు వచ్చి, జనాలను ఆకట్టకునేలా వున్నాయి. అయితే ఇలా ఇవ్వడం వల్ల లలిత జ్యూవెలర్స్ ఏమనుకుంటారో కనుక్కుని, వాటిని కమర్షియల్ గా వాడాలని ఆలోచిస్తున్నారు.