చరణ్, సమంత మధ్యలో మీడియేటర్

సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో రామ్ చరణ్ చెవిటివాడిగా నటిస్తున్నాడనే వార్త దాదాపు పక్కా అయింది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఈ విషయాన్ని చాలామంది నిర్థారించారు కూడా. అంటే సినిమాలో రామ్ చరణ్…

సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో రామ్ చరణ్ చెవిటివాడిగా నటిస్తున్నాడనే వార్త దాదాపు పక్కా అయింది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఈ విషయాన్ని చాలామంది నిర్థారించారు కూడా. అంటే సినిమాలో రామ్ చరణ్ డైలాగ్స్ చెబుతాడు కానీ, ఎదుటి వ్యక్తి చెప్పే డైలాగ్ ను అర్థం చేసుకోలేడన్నమాట. మరి ఇలాంటి కుర్రాడితో ప్రేమలో పడిన సమంత తన ప్రేమను ఎలా ఎక్స్ ప్రెస్ చేస్తుంది? తన మనసులోని భావాల్ని ఎలా పంచుకుంటుంది..?

సరిగ్గా ఇక్కడే మీడియేటర్ తెరపైకొచ్చాడు. అవును.. చరణ్-సమంత ప్రేమకు మధ్యవర్తిగా ఓ నటుడు ఉన్నాడు. ఆ క్యారెక్టర్ సినిమాకు చాలా కీలకం అంటున్నారు. సమంత చెప్పే మాటల్ని, రామ్ చరణ్ కు సైగలతో అర్థమయ్యేలా చెప్పే పాత్ర అది. ఈ క్యారెక్టర్ తో కామెడీ పండించడంతో పాటు సినిమాలో కీలకమైన ఓ సందర్భంలో కూడా ఈ పాత్ర కీరోల్ ప్లే చేస్తుందట.

1980ల నాటి విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. గురువారం నుంచి సినిమాకు సంబంధించి రాజమండ్రిలో మరో షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన ఓ సెట్ లో రామ్ చరణ్ పై ఇంట్రడక్షన్ సాంగ్ తీయబోతున్నారు.