పెద్దసినిమాల సందడి ముగిసిపోయింది.దీంతో మీడియం, చిన్నతరహా సినిమాలు ముస్తాబైపోతున్నాయి. 10న దిక్కులు చూడకు రామయ్యా, పాఠశాల, 17న ఒక లైలా కోసం, కరెంటుతీగ, 24న కార్తికేయ, ఇంకా విజయ్ కత్తి డబ్బింగ్ సినిమా విడుదలకు డిసైడ్ అయిపోయాయి.
సోలోగా వద్దామనుకున్న కరెంట్ తీగ ఆశలు నెరవేరలేదు. ఒక లైలా కోసంతో పోటీ తప్పడం లేదు. ఈ నెల ఈ సినిమాలు అన్నీ అయిపోతే, వచ్చే నెలకు అల్లరి నరేష్ బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, మెగా క్యాంప్ నుంచి సాయి ధరమ్ తేజ సినిమా వుంటాయి. డిసెంబర్ చివరకు కానీ మళ్లీ పెద్ద సినిమాల సందడి ప్రారంభం కాదు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు