మెగా అల్లుడి ఎంట్రీ అంత సైలంట్ నా?

మెగా అల్లుడి టీజర్ వచ్చింది. మామూలుగా ఏ కొత్త నటుడు అన్నా అయితే, ఆపాటి టీజర్ ను ఎవ్వరూ పట్టించుకోరు. కానీ మెగా అల్లుడు కళ్యాణ్ టీజర్ కాబట్టి కాస్త ఆసక్తి. కానీ ఆ…

మెగా అల్లుడి టీజర్ వచ్చింది. మామూలుగా ఏ కొత్త నటుడు అన్నా అయితే, ఆపాటి టీజర్ ను ఎవ్వరూ పట్టించుకోరు. కానీ మెగా అల్లుడు కళ్యాణ్ టీజర్ కాబట్టి కాస్త ఆసక్తి. కానీ ఆ ఆసక్తి మెగా ఫ్యామిలీలో వున్నట్లు మాత్రం కనిపించడం లేదు.

ఎందుకంటే మెగా హీరోల్లో ఎవరి సినిమాలకు చెందిన చిన్న లుక్ వచ్చినా, టీజర్ వచ్చినా, ట్రయిలర్ వచ్చినా ట్విట్టర్లో ప్రతి ఒక్కరు, అబ్బో సూపర్.. కేక అనే టైపులో హడావుడి చేస్తారు. కానీ మెగా అల్లుడి టీజర్ విషయంలో అలాంటి హడావుడి ఏమీ కనిపించలేదు.

మెగాభిమానులు కూడా పెద్దగా హల్ చల్ చేయలేదు ట్విట్టర్ లో. ఓ మాదిరిగా మాత్రమే టీజర్ అటు ఇటు తిరిగింది. సరే, యూట్యూబ్ లో వన్ మిలియన్ దాటేసింది. ఈ రోజుల్లో అన్నీ మిలియన్లకు మిలియన్లే. 18పైసలు పెడితే క్లిక్ వచ్చేలా అయిపోయింది పరిస్థితి.

కానీ సెలబ్రిటీల ట్వీట్ లు, రీట్వీట్ లు అన్నవి వేరు వాటి వల్ల వచ్చే కిక్ వేరు. అవి మాత్రం ఎందుకు రాలేదో? బహుశా ఏం హడావుడి చేయవద్దని పెద్దాయన చెప్పారేమో అన్న అనుమానం కూడా వుంది.

వీలయినంతలో ప్రొఫైల్ లో వెళ్లాలని ప్లాన్ ఏమన్నా చేసారేమో? మొత్తంమీద ఏదో వుంది విషయం. విడుదలకు ముందు అయినా హడావుడి చేస్తారేమో? ఆ మధ్య నాగబాబు కుమార్తె తొలి సినిమాకు విడుదల ముందు రామ్ చరణ్, బన్నీ తదితరుల ఎంట్రీ ఇచ్చి, కాస్త హల్ చల్ చేసారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తారేమో? అప్పుడు ట్విట్టర్ మోత మోగుతుందేమో ?