మెగా సినిమాపై సమైక్య ముద్ర?

సినిమా అభిమానం అంటే పిచ్చితో సమానం. ఆ పిచ్చిలో ఏదేదో చేస్తుంటారు. కొందరికి దురభిమానం కూడా వుంటుంది. వీళ్లు మరీనూ. అలాంటి బాపతు జనాలు కొత్తగా ఓ వాట్సప్ పోస్ట్ తయారుచేసారు. సంక్రాంతికి మెగాస్టార్…

సినిమా అభిమానం అంటే పిచ్చితో సమానం. ఆ పిచ్చిలో ఏదేదో చేస్తుంటారు. కొందరికి దురభిమానం కూడా వుంటుంది. వీళ్లు మరీనూ. అలాంటి బాపతు జనాలు కొత్తగా ఓ వాట్సప్ పోస్ట్ తయారుచేసారు. సంక్రాంతికి మెగాస్టార్ 150 వ సినిమా  వస్తోంది కదా. దీనికి బీభత్సమైన హైప్ వుంది. మరి దాన్ని ఎలా అడ్డాలి. అందుకే ఈ అడ్డదారి తొక్కినట్లుంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏమిటంటే..

“.. వేయి మంది ఉద్యమకారుల మరణానికి కారణమైన తెలంగాణ ద్రోహీ చిరంజీవి సినిమా ఖైదీ నం .150 సినిమాను తెలంగాణ రాష్ట్రంలో విడుదల కాకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక ఉద్యమకారులుగా కోరుతున్నాము . తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాకుండ అడ్డుపడి తెలంగాణ ప్రజలను మోసం చేయడమే కాకుండా వేయి మంది ఉద్యమకారుల మరణానికి కారణమైన వాడిలో ఇతను ముఖ్యుడు కాబట్టి ఒక సగటు తెలంగాణ వాడిగా తెలంగాణ రక్తం , చీము ,రక్తం ఉన్న ప్రతి ఒక్కడు ఈ సినిమాని థియేటరు లో చూడవద్దు అని మనవి చేస్తున్నాము. చిరంజీవి సినిమాని థియేటరు లో చూసినవాడు తెలంగాణ ద్రోహీ ..’’

ఇదీ ఆ పోస్టింగ్. నిజానికి చిరంజీవి తెలంగాణ విభజనకు ఏ విధంగా అడ్డం పడ్డారు. సమైక్య ఉద్యమానికి మద్దతు పలికినంత మాత్రాన తెలంగాణ ద్రోహి అయిపోతారా? ఆ మాటకు వస్తే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి చిరంజీవి ఆ పార్టీ ఎంపీ. ఆ లెక్కన చిరంజీవిని తెలంగాణ జనాలు నెత్తిన పెట్టుకుని ఆదరించాలి కదా? అలా పాజిటివ్ గా ఆలోచించడం మానేసి, ఇలాంటి నెగిటివ్ ప్రాపగండా స్టార్ట్ చేయడం అంటే కచ్చితంగా దురభిమానం కాక ఏమిటి?

పైగా చిరంజీవి చాలా డిప్లమాటిక్ పర్సన్. ఎవర్నీ నొప్పించే తత్వం కాదు. ఎదుటివాళ్లు ఏమైనా అనుకుంటారేమో అని తానే అనుకుని, ముందుగా తదనుగుణంగా మాట్లాడే వ్యక్తి. అలాంటి వ్యక్తి సినిమా మీద ఇలాంటి వాట్సప్ ప్రచారం ఏమిటో?