మెగాస్టార్ సినిమాల వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ఎవరు అంటే, క్రాంతి రెడ్డి అనే సమాధానమే వస్తుంది. అంతలా మెగా సినిమాలను తనే తీసుకునేవారు. అలాంటిది ఇప్పుడు ప్రెస్టీజియస్ గా తయారవుతున్న 150 వ సినిమా ఖైదీ నెం 150 ని మాత్రం ఆ డిస్ట్రిబ్యూటర్ వదిలేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీనికి కారణం, నిర్మాత రామ్ చరణ్ ఆ సినిమా ఉత్తరాంధ్ర హక్కులు 8 కోట్లకు తక్కువ అమ్మేది లేదని పట్టుపట్టడమే నట. క్రాంతి రెడ్డి ఈ సినిమాకు 7.5 కోట్ల వరకు ఆఫర్ ఇచ్చారట. అంతకు మించి కష్టమని, అది కూడా కాస్తయినా రిటర్న్ గ్యారంటీ వుండాలని ఆయన అన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఆఖరికి వేరే సంస్థకు 8 కోట్లకు ఇచ్చారట. దానికి టెర్మ్స్ ఏమిటన్నది ఇంకా బయటకు రాలేదు. మొత్తానికి బాహుబలి దాటి లేదా, దాంతో సమానమైన రికార్డులు సృష్టించాలని మెగాస్టార్ ఫ్యామిలీ కాస్త గట్టి పట్టుదలతోనే వున్నట్లు కనిపిస్తోంది.